డ్రెస్సింగ్ కాంట్రవర్సీ.. ఇప్పుడు వాళ్ళిద్దరే ట్రెండింగ్..

హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు.. ఎలాంటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే.;

Update: 2026-01-06 10:11 GMT

హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు.. ఎలాంటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఓ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి. దీంతో అనేక మంది ఆయన చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. అలా మాట్లాడటం అసలు కరెక్ట్ కాదని సూచించారు.

అదే సమయంలో ఆ కాంట్రవర్సీలోకి యాంకర్ అనసూయ వచ్చి.. శివాజీ కామెంట్స్ కు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత శివాజీ అనసూయ పోస్ట్ కోసం మాట్లాడారు. అలా వివాదం కాస్త శివాజీ వర్సెస్ అనసూయ భరద్వాజ్ అనే విధంగా మారింది. గత కొన్ని రోజులుగా సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది.

హీరోయిన్ల డ్రెస్సింగ్ పై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు అనసూయకు మద్దతుగా మాట్లాడుతున్నారు. రీసెంట్ గా యూట్యూబర్ అన్వేష్ స్పందించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రెస్పాండ్ అయ్యే సమయంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఫాలోవర్స్ ను పెద్ద ఎత్తున కోల్పోతున్నాడు.

అదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు శివాజీ, అనసూయ కాంట్రవర్సీలో మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. వారిద్దరూ మాట్లాడిన వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఇద్దరూ పాల్గొన్న డిబేట్ లు, చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మీమ్స్ కు మెటీరియల్ గా మారాయి.

అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడు అంటూ చెప్పుకుంటున్న మురళీ శర్మ అనే వ్యక్తి.. తన ఫేవరెట్ నటి కోసం ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు. తనకు అనసూయ అంటే చాలా అభిమానమని చెబుతున్నాడు. పొట్టి బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పిక్స్ పెడుతుందని, అవి ఇష్టమని వ్యాఖ్యానిస్తున్నాడు. వాటిని ఇష్టంగా చూస్తామని అంటున్నాడు.

ఇక మురళీ శర్మ చేసిన కామెంట్స్ కు ఓ రాజకీయ పార్టీ నాయకురాలు బొజ్జా సంధ్య రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. అలాంటి ఫోటోలు పెట్టడమేమిటని క్వశ్చన్ చేస్తున్నారు. మురళీ శర్మ కామెంట్స్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ పలు మీడియా డిబేట్స్ లో పాల్గొన్నారు. ఇద్దరూ గట్టిగా వాదించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

దీంతో మురళీ శర్మ, సంధ్యా రెడ్డి పాల్గొన్న మీడియా డిబేట్స్ కు సంబంధించిన చిన్న చిన్న వీడియో క్లిప్స్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వారిద్దరూ మాట్లాడిన కామెంట్స్.. మీమ్స్ రూపంలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా అన్ని ప్లాట్ ఫామ్స్ లో కూడా అవే ఉన్నాయి. దీంతో వారిద్దరూ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News