బుట్ట‌బొమ్మ‌ని మించిన సింగారం మృణాల్ సొంతం!

కానీ కొన్ని ప్ర‌త్యేక‌మైన డిజైన్లు మాత్రం ఎవ్వెర్ గ్రీన్ గా క‌నెక్ట్ అవుతుంటాయి.;

Update: 2023-12-22 13:30 GMT

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే బ్యూటీ గురించి ఎంత‌గా పొగిడేస్తామో తెలిసిందే. బుట్ట‌బొమ్మ డిజైన్ తో కూడిన గౌను పూజ ధ‌రించ‌డంతోనే! అంత‌టి బ్యూటీ సొంత‌మైంది. ఎన్నో డిజైన్స్ లో హీరోయిన్స్ క‌నిపిస్తుంటారు. కానీ కొన్ని ప్ర‌త్యేక‌మైన డిజైన్లు మాత్రం ఎవ్వెర్ గ్రీన్ గా క‌నెక్ట్ అవుతుంటాయి. అలాంటి వాటి గురించి ఎక్కువ‌గా చ‌ర్చించుకుంటాం. తాజాగా బుట్ట‌బొమ్మ‌ని మించిన బ్యూటీని మృణాల్ త‌ల‌పిస్తుంది.


అవును ఇక్క‌డ అమ్మ‌డు ముస్తాబైన విధానం చూస్తే బుట్ట‌బొమ్మ ఏ కోసానా స‌రిపోదు అనిపిస్తుంది. లెహంగా ని పోలిని గౌనులో మృణాల్ ఓ అద్భుతం అన‌డంలో అతిశ‌యెక్తి లేదు. గ్రీన క‌ల‌ర్ బ్యాక్ లెస్ డిజైన్...న‌డుం ద‌గ్గర నుంచి కాలా పాదాల వ‌ర‌కూ ఉన్న మ‌ల్టీ డిజైన్ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. అమ్మ‌డి ఎత్తును మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన ఈ దుస్తుల్లో మృణాల్ ఎంతో అందంగా క‌నిపిస్తుంది.


ఇక చేతుల్లో హై హీల్స్ ని హైలైట్ చేస్తుంది. డ్రెస్ మ్యాచింగ్ చెప్పులు ధ‌రించాలి. కానీ ఈ డిజైన్ పై హై హీల్స్ ధ‌రిస్తే అవెక్క‌డా క‌నిపించ‌వు. అందుకే ఇలా వాటిని ఇలా స్టైలిస్ట్ ఇలా చేతుల్లో ఉంచి కెమెరాకి అనువైన భంగిమ‌ని సెల‌క్ట్ చేసుకున్నాడు. మ‌రి ఇదంతా ఎందుకోసం అంటే? వెడ్డింగ్స్ హ‌నీమూన్ క‌వ‌ర్ పేజీ కోసం మృణాల్ ఇలా ముస్తాబైంది. ముంబై నోవెటాల్ లో ఈ ఫోటో సెష‌న్ జ‌రిగింది.


2023-24 మంత్లీ క‌వ‌ర్ పేజీ కోసం ఇలా మృణాల్ మ‌తి చెడే బ్యూటీతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నుంది. ప్ర‌స్తుతం సెల‌బ్రిటీల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్స్ ఎక్కువ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో అంద‌మైన ప్ర‌దేశాల్లో నిరాండంబ‌రంగా పెళ్లి చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ్యాగ‌జైన్ లో ఆ ర‌క‌మైన అంశాల్ని హైలైట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంతార్జాలంలో వైర‌ల్ గా మారింది. మృణాల్ అలంక‌ర‌ణ‌కు అంతా ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News