చీరకట్టులో సీత అందాలు.. నాకోసమే డిజైన్ చేశారేమో అంటూ!
ఈ క్రమంలోనే తాజాగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఇంస్టాగ్రామ్ వేదికగా హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన చీర కట్టుకొని వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
నాటితరం ఆడియన్స్ లో టాలీవుడ్ జానకమ్మ అంటే అంజలీదేవి గుర్తొచ్చినట్టు.. నేటితరం యువతకు టాలీవుడ్ సీత అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నేరుగా తెలుగులో చేసిన సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఒదిగిపోయింది. కట్టుబొట్టు అచ్చు మన ఇంటి అమ్మాయిలా కనిపించి అందరి హృదయాలను దోచుకుంది . ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయిన ఈమె.. కుర్రకారు క్రష్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన సమయంలో చాలామంది అబ్బాయిలు తమ కాబోయే అమ్మాయి ఇలాగే ఉండాలని కోరుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలా ఒక్క సినిమాతో ఒక్క పాత్రతో అందరి హృదయాలను దోచుకుంది.
అలాంటి ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఔట్ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఇంస్టాగ్రామ్ వేదికగా హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన చీర కట్టుకొని వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రముఖ డిజైనర్ అర్పిత మెహతా డిజైన్ చేసిన లేత ఆకుపచ్చ రంగు ఎంబ్రాయిడరీ చీర ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో అదే ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన బ్లౌజు ధరించి తన అవుట్ ఫిట్ తో తన లుక్ ను ఫుల్ ఫీల్ చేసుకుంది. ట్రైబ్ అమ్రపాలి జువెలరీతో తన స్టైల్ ను మరింత పెంచుకున్న ఈమె ను ఇంత అందంగా మార్చింది మాత్రం స్నేహల్ అనే చెప్పాలి.
ఇక ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ దీపాలి డియోకర్ నేతృత్వంలో తన జుట్టును మరింత అందంగా తీర్చిదిద్దుకున్న ఈమెకి మిస్ బ్లెండర్ మేకప్ అద్దింది. అలా మొత్తానికైతే మృనాల్ ఠాకూర్ లేటెస్ట్ ఔట్ ఫిట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రేడియంట్ స్కిన్ తగ్గట్టు ఎలిగేంట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంది. పైగా ఈ ఫోటోల కింద క్యాప్షన్ గా ఈ అద్భుతమైన చీరను నాకోసమే డిజైన్ చేశారు అంటూ క్యాప్షన్ జోడించింది..మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. 2012లో ముజ్సే కుచ్ కేహేతి అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. 2014లో విట్టి దండు అనే మరాఠీ చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తర్వాత హిందీ , తెలుగు సినిమాలలో నటించడం మొదలుపెట్టింది.
సీతారామం సినిమా తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలలో నటించిన మృణాల్.. ఈ ఏడాది డెకాయిట్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ 22వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే హిందీలో రెండు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఇలా ఒకవైపు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే మరొకవైపు ఇలా వరుసగా గ్లామర్ వలకబోస్తూ ఆడియన్స్ను కట్టిపడేసే ప్రయత్నం చేస్తోంది.