కూలీ : మోనికాలో రజనీ ఎందుకు లేడంటే..!

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్న పాటల్లో కూలీలోని మోనికా పాట ఒకటి అనే విషయం తెల్సిందే.;

Update: 2025-08-02 12:30 GMT

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతున్న పాటల్లో కూలీలోని మోనికా పాట ఒకటి అనే విషయం తెల్సిందే. సాధారణంగా స్టార్‌ హీరోల సాంగ్స్‌, వారి స్టెప్స్‌ కారణంగా వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. కానీ మోనికా పాటలో రజనీకాంత్‌ ఉండడు. అయినా కూడా తెగ వైరల్‌ అవుతోంది. పూజా హెగ్డే ఈ ఐటెం సాంగ్‌లో డాన్స్ చేసింది. ఆమె రెడ్‌ డ్రెస్‌లో చూపరులను కట్టి పడేస్తుంది. అయితే అంతకు మించి అన్నట్లుగా మలయాళ నటుడు సౌబిన్‌ వేసిన డాన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఐటెం సాంగ్స్‌లో హీరోయిన్‌ అందం గురించి, హీరోలు వేసే డాన్స్‌ల గురించి ప్రముఖంగా చర్చ జరగడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఐటెం సాంగ్‌లో సౌబిన్‌ వేసిన ఫన్నీ డాన్స్ గురించి చర్చ జరుగుతూ పాట స్థాయిని పెంచి, సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది అనడంలో సందేహం లేదు.

కూలీకి కమర్షియల్‌ టచ్‌ కోసం మోనికా పాట

సౌబిన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాంటి సౌబిన్‌ పై ఐటెం సాంగ్‌ చేయడం అనేది ఖచ్చితంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ తీసుకున్న చాలా పెద్ద నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ ఈ ఐటెం సాంగ్‌ గురించి స్పందించాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్‌ మాట్లాడుతూ.. మోనికా పాట ఇంతటి విజయాన్ని సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఈ పాట కేవలం కమర్షియల్ వ్యాల్యూస్‌ కోసమే పెట్టాను. సాధారణంగా నా సినిమాలో ఐటెం సాంగ్స్‌కి స్కోప్ ఉండదు. కథ చెడి పోతుందనే ఉద్దేశంతో నేను ఐటెం సాంగ్స్‌పై ఆసక్తి చూపించను. కానీ ఈ సినిమాలో కథానుసారం సౌబిన్‌ పై పాట ఉంటే బాగుంటుంది అనుకున్నాను.

అనిరుధ్‌ అందించిన సంగీతం ప్లస్‌

పాటతో సినిమాకు రీచ్ వస్తుందని, ఆ పాట సౌబిన్‌ పాత్రకు అవసరం అని భావించి పూజా హెగ్డే తో చేయించామని అన్నాడు. పూజా హెగ్డే యొక్క లుక్‌ తో పాటు, ఇతర విషయాలు సినిమాపై అంచనాలు పెంచింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా సైతం ఉంటుందని అన్నాడు. అనిరుధ్‌ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఇప్పటికే వచ్చిన మోనికా తో పాటు విడుదల సమయంలో రాబోతున్న ఒక పాట సినిమా గురించి ప్రేక్షకుల అభిప్రాయం ను పూర్తిగా మార్చే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవల రజనీకాంత్‌ పవర్‌ హౌస్‌ పాట గురించి స్పందిస్తూ అనిరుధ్‌ ను తెగ అభినందించాడు. తన హుకుంను మించి పవర్‌ హౌస్‌ పాట ఉందని రజనీకాంత్‌ సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

రజనీకాంత్‌కి మోనిక సెట్‌ కాదు

మోనికా పాటను చాలా మంది సౌబిన్‌తో కాకుండా రజనీకాంత్‌తో చేసి ఉంటే బాగుండేది కదా అని ప్రశ్నిస్తున్నారు. కథ లో రజనీకాంత్‌ పాత్రకు ఆ పాట సెట్‌ కాదని, కమర్షియల్‌ వ్యాల్యూస్‌ కోసం పాటను రజనీకాంత్‌కి బలవంతంగా అతికించాలని అనుకోలేదని లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు. సినిమాలో పాట ఉంటే బాగుంటుంది, జనాలకు మరింతగా సినిమా చేరువ అవుతుందనే ఉద్దేశంతో సౌబిన్‌ పాత్ర తో పాటను చేశామని అన్నాడు. ఇలా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌తో పాటను పెట్టడం ద్వారా లోకేష్ కనగరాజ్‌ కొత్త ట్రెండ్‌కి తెర లేపినట్లు అయింది.

గతంలో విలన్‌లకు ఐటెం సాంగ్స్ పెట్టడం కామన్‌ విషయంగా మనం చూశాం. ఇప్పుడు ఈ మోనికా పాటతో సరికొత్త ట్రెండ్‌ను లోకేష్ కనగరాజ్‌ క్రియేట్‌ చేశాడని చెప్పక తప్పదు. ఆయన నుంచి ముందు ముందు ఇలాంటి ప్రయోగాత్మక పాటలు మరిన్ని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆగస్టు 14న కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగులోనూ ఆసక్తి ఉంది. కూలీకి పోటీగా వార్‌ 2 విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య వార్‌ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News