మామ్‌2.. ఖుషీకి అగ్నిపరీక్ష, లెగసీకి కొత్త అధ్యాయం

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రిలీజైన మామ్ మూవీ బాలీవుడ్‌లో భావోద్వేగ ప్రధాన చిత్రంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.;

Update: 2026-03-03 07:28 GMT

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం రిలీజైన మామ్ మూవీ బాలీవుడ్‌లో భావోద్వేగ ప్రధాన చిత్రంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా శ్రీదేవి తన కెరీర్‌లో అత్యంత ప్రశంసలు అందుకున్న ప్రదర్శనగా ఈ సినిమా నిలిచింది. ఇప్పుడ‌దే సినిమాకి సీక్వెల్ రూపంలో మామ్2 సెట్స్‌పైకి రావడంతో, ఫ్రాంచైజ్‌పై మళ్లీ ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి ఫోకస్ పూర్తిగా కొత్త తరం వైపు మళ్లింది.

ల‌వ్ యాపా సినిమాలోని యాక్టింగ్ కు విమ‌ర్శ‌లు

మామ్2లో మెయిన్ లీడ్ గా శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ క‌పూర్ కనిపించనుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమెకు ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఖుషీ గ‌త సినిమా ల‌వ్ యాపా రిలీజ్ టైమ్ లో ఆమె యాక్టింగ్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెష‌న్స్ విషయంలో ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అవసరమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మామ్2 ఆమె కెరీర్‌కు నిజమైన టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్న చర్చ మొదలైంది. భావోద్వేగంతో పాటు బలమైన న్యాయపరమైన కథనం ఉండే ఈ ఫ్రాంచైజ్‌లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆడియ‌న్స్ అంచనాలను అందుకోగలదా అన్నది ఆసక్తికరంగా మారింది.

బోనీ క‌పూర్ ఎమోష‌న‌ల్ డెసిష‌న్

ఇదే సమయంలో నిర్మాతగా బోనీ క‌పూర్ తీసుకున్న నిర్ణయం కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. తన భార్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాకి సీక్వెల్ రూపొందించడం ఒకవైపు భావోద్వేగపూరిత నిర్ణయం అయితే, మరోవైపు వ్యూహాత్మక అడుగుగా కూడా చూడవచ్చు. మామ్ బ్రాండ్‌కు ఉన్న ఎమోష‌న‌ల్ వాల్యూని కొనసాగిస్తూ, ఈ జెన‌రేష‌న్ హీరోయిన్ తో ఫ్రాంచైజ్‌ను విస్తరించాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఒక లెగసీని కొత్త దిశలో నడిపించే ప్రయత్నం అని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పోలిక‌లు త‌ప్ప‌వు

అయితే, ఈ ప్రాజెక్ట్ ముందున్న అతిపెద్ద సవాలు పోలికల ఒత్తిడి. శ్రీదేవి లాంటి లెజెండరీ నటి చేసిన సినిమాను ఇప్పుడు వేరే వారు చేస్తున్న‌ప్పుడు కంపేరిజ‌న్ ఆటోమేటిక్ గా వ‌స్తుంది. ఆమె సృష్టించిన ఎమోష‌న‌ల్ ఎఫెక్ట్ ప్రేక్షకుల మదిలో ఇంకా సజీవంగానే ఉంది. అలాంటి నేపథ్యంలో ఖుషి నటనను అదే ప్రమాణాలతో కొలవడం సహజం. ఫ్రాంచైజ్‌కు ఉన్న వారసత్వం ఒకవైపు బలం అయితే, మరోవైపు అదే అంచనాల భారంగా మారే అవకాశమూ ఉంది.

కాబట్టి మామ్2 స‌క్సెస్ కేవలం గత జ్ఞాపకాలపై ఆధారపడదు. కథనం బలం, దర్శకత్వ దృష్టి, ముఖ్యంగా ఖుషి ప్రదర్శన.. ఈ మూడు అంశాలపై ఫలితం ఆధారపడనుంది. లెగసీని గౌరవిస్తూ, కొత్త అధ్యాయాన్ని విజయవంతంగా ప్రారంభించగలిగితేనే ఈ సీక్వెల్ నిజమైన అర్థంలో సక్సెస్‌గా నిలుస్తుంది. లేదంటే, ఇది కేవలం ఎమోష‌న‌ల్ ఎక్స్‌పెరిమెంట్‌గానే మిగిలిపోవచ్చు.

Tags:    

Similar News