ఇండస్ట్రీకి మరో వారసురాలు.. కూతురు ఎంట్రీపై స్టార్ హీరో రియాక్షన్!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఒక స్థానానికి చేరుకున్నారు అంటే.. కచ్చితంగా తమ వారసులను అదే రంగంలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తారు.;

Update: 2025-08-21 20:30 GMT

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఒక స్థానానికి చేరుకున్నారు అంటే.. కచ్చితంగా తమ వారసులను అదే రంగంలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అలా వచ్చిన వారు అందరికీ తమ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడిందా అంటే? లేదనే చెప్పాలి. వాస్తవానికి ఫిలిం బ్యాక్ గ్రౌండ్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి, ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు రావడానికి ఉపయోగపడుతుందే కానీ.. వరుసగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను వాడుకొని ఇండస్ట్రీలో అవకాశాలు సొంతం చేసుకుంటామంటే కుదరదు అని ఇప్పటికే ఎంతోమంది స్టార్ కిడ్స్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కూతురు..

అయితే ఇక్కడ ఒక స్టార్ హీరో మాత్రం తన పిల్లలు తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో రాణించడం తనకు ఇష్టం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తన కూతురు ఇండస్ట్రీ ఎంట్రీపై కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. అందరి హీరోల లాగానే ఈయన కూడా తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. 'తుడక్కమ్' అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోంది మోహన్ లాల్ కుమార్తె విస్మయ. ఈమె సినీ ఇండస్ట్రీకి అరంగేట్రం చేయబోతుండడంతో మోహన్ లాల్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కూతురు ఎంట్రీపై మోహన్ లాల్ ఊహించని కామెంట్..

ఇదిలా ఉండగా.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్ తన కూతురి అరంగేట్రం గురించి మాట్లాడుతూ ఎవరూ ఊహించని కామెంట్లు చేశారు. తన కూతురు ఎంట్రీపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. "విస్మయకి నటనపై ఆసక్తి ఉంది అని నాతో ఎప్పుడో చెప్పింది. కానీ నా పిల్లలు కాబట్టి గొప్పవారు కావాలని నేనెప్పుడూ కూడా అనుకోలేదు. వారి ప్రతిభతో వారు గుర్తింపు తెచ్చుకుంటే.. అది వారి భవిష్యత్తుకే మంచిది. అదే వారిని ముందుకు నడిపిస్తుంది. వాళ్ళు ఇండస్ట్రీకి వస్తామని చెప్పినప్పుడు కూడా.. నేను ఇదే చెప్పాను" అంటూ కూతురు ఇండస్ట్రీ ఎంట్రీపై స్పందించారు మోహన్ లాల్.

కూతురే కాదు గతంలో కొడుకు కూడా..

ఇకపోతే మోహన్ లాల్ కొడుకు కూడా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ 2018లోనే సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఇటీవలే తన సోదరి సినీ రంగంలోకి రాబోతున్న విషయాన్ని అభిమానులతో చెప్పుకొచ్చి ఆమెకు గ్రాండ్ వెల్కమ్ కూడా పలికారు. మొత్తానికి అయితే మోహన్ లాల్ తన పిల్లలు ఇద్దరికీ రియాలిటీలో బ్రతకమని సూచించడం ప్రశంసనీయమని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

అమ్మ అధ్యక్షురాలిపై ప్రశంసలు కురిపించిన మోహన్ లాల్..

ఇదిలా ఉండగా మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆడవారిపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మోహన్ లాల్. అటు 2027లో జరగాల్సిన ఎన్నికలు ఈయన కారణంగా ఈ ఏడాది నిర్వహించారు. అలా ఈ ఎన్నికలలో శ్వేతా మీనన్ అమ్మ అధ్యక్షురాలిగా ఎంపిక అయ్యింది. ముఖ్యంగా 31 సంవత్సరాల అమ్మ చరిత్రలో ఒక మహిళ అధ్యక్షురాలిగా స్థానం సంపాదించుకోవడం ప్రశంసనీయమని చెప్పాలి. ఈమె పై మోహన్ లాల్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అమ్మకు ఎప్పుడు తాను సహాయ సహకారాలు అందిస్తానని, ప్రస్తుతం అసోసియేషన్ లో 560 మంది ఉండగా.. కొత్త వాళ్లు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News