ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన హిట్ మూవీ దృశ్యం 3.. ఎప్పుడు? ఎక్కడంటే?

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, సస్పెన్స్ సినిమాల స్పెషలిస్ట్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ థ్రిల్లర్ సిరీస్ 'దృశ్యం 3'.

Update: 2026-06-13 10:02 GMT

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, సస్పెన్స్ సినిమాల స్పెషలిస్ట్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ థ్రిల్లర్ సిరీస్ 'దృశ్యం 3'. థియేటర్లలో రీసెంట్‌గా రిలీజ్ అయి, ఏకంగా రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ క్రైమ్ మిస్టరీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 18 నుండి 'దృశ్యం 3' స్ట్రీమింగ్ కాబోతోంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రానుండటంతో సినిమా లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..

నెల తిరక్కుండానే డిజిటల్ ఎంట్రీ:

మే 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన 'దృశ్యం 3', నెల కూడా కాకముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేస్తోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారికి మరియు జార్జ్‌కుట్టి మైండ్ గేమ్‌ను మళ్లీ చూడాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్. ఇక సస్పెన్స్, ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ 236 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఫ్రాంచైజీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

'దృశ్యం 2' ఎక్కడ ముగిసిందో.. అక్కడ నుంచే:

ఈ పార్ట్ కథ విషయానికి వస్తే.. రెండో భాగం ఎక్కడ ఆపేశారో అక్కడ నుంచే జీతూ జోసెఫ్ 'దృశ్యం 3' అసలు ఆటను మొదలుపెట్టారు. కోర్టు తీర్పుతో వరుణ్ హత్య కేసు నుండి జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్) ఫ్యామిలీ ప్రస్తుతానికి సేఫ్ అవుతుంది. ఇక తన లైఫ్‌లో జరిగిన ఈ సంచలన ఘటనలనే కథగా మార్చి జార్జ్ నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. అంతా హ్యాపీగా ఉందనుకున్న టైమ్‌లో గతం మళ్లీ నీడలా వెంటాడుతుంది.

జార్జ్‌కుట్టి ఫ్యామిలీకి కొత్త కష్టాలు:

ట్రామా నుండి కోలుకున్న తన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని జార్జ్, రాణి (మీనా) సంబంధాలు చూస్తుంటారు. కానీ, వచ్చే సంబంధాలన్నీ వింతగా రద్దవుతుంటాయి. ఇక ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అంజు గతం గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని జార్జ్‌కుట్టికి అర్థమవుతుంది. కొడుకును కోల్పోయిన బాధతో అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్ (ఆశా శరత్), ప్రభాకర్ (సిద్ధిఖీ) మళ్లీ జార్జ్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తారు.

పద్మవ్యూహంలో జార్జ్‌కుట్టి.. క్లైమాక్స్ ఏంటి?:

మరోవైపు, సస్పెండ్ అయిన కరడుగట్టిన పోలీస్ ఆఫీసర్ సహదేవన్ (మురళీ గోపి) వేసిన కొత్త వ్యూహంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈసారి జార్జ్‌కుట్టిని గట్టిగా లాక్ చేస్తుంది. ఇక చివరకు జార్జ్‌కుట్టి ఖైదీగా మారాల్సి వస్తుంది. పోలీసులు ఆయన చుట్టూ పక్కాగా పద్మవ్యూహం పన్నుతారు. మరి ఈ క్లిష్ట పరిస్థితి నుండి తన కుటుంబాన్ని శాశ్వతంగా కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి వేసిన ఆ ‘అంతిమ వ్యూహం’ ఏంటి? అనేదే 'దృశ్యం 3' అసలైన ట్విస్ట్.

జీతూ జోసెఫ్ మార్క్ స్క్రీన్‌ప్లే, మోహన్‌లాల్ ఇంటెన్స్ యాక్టింగ్ ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్స్. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, ఈ మైండ్-బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ను చూసి థ్రిల్ ఫీల్ అవ్వడానికి జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిద్ధంగా ఉండండి. ఇక జార్జ్‌కుట్టి ఈసారి పోలీసులకు ఎలాంటి షాక్ ఇచ్చాడో ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

Tags:    

Similar News