దృశ్యం ఫ్రాంచైజీకి సరైన ఎండింగ్ లేనట్లేనా?

రెండు పార్టులు సూపర్ హిట్ కాగా.. తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అందుకే దృశ్యం 3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Update: 2026-06-08 10:20 GMT

మాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో దృశ్యం ఒకటి. సాధారణ ఫ్యామిలీ స్టోరీని ఒక హత్య కేసుతో లింక్ చేసి, ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచిన ఆ సిరీస్‌ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. రెండు పార్టులు సూపర్ హిట్ కాగా.. తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ అయిన రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అందుకే దృశ్యం 3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మోహన్‌ లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం 3 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల తర్వాత సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి రిజల్ట్స్ అందుకుంది. ముఖ్యంగా తొలి పార్ట్ తో పోలిస్తే కథ నెమ్మదిగా సాగిందని, ఫస్టాఫ్ లో పెద్దగా కొత్తదనం కనిపించలేదని విమర్శలు వచ్చాయి. కానీ సెకండాఫ్ లో కథ మలుపులు తిరిగిన తీరు, ప్రీ క్లైమాక్స్‌ ఆకట్టుకున్నాయి.

దీంతో నెగెటివ్ టాక్‌ ను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ చిత్రం మలయాళ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇది దృశ్యం బ్రాండ్‌ కు ఉన్న క్రేజ్ ను మరోసారి నిరూపించింది. అయితే కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదే ఫ్రాంచైజీ ఎండింగ్ పై. సాధారణంగా ఒక ఫ్రాంచైజీకి మంచి ఎండింగ్ ఉండాలని ఆడియన్స్ ఆశిస్తారు.

ముఖ్యంగా మూడు పార్టుల వరకు వచ్చిన కథకు సరైన ముగింపు ఉంటుందని భావిస్తారు. కానీ దృశ్యం 3 విషయంలో అలా జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా ముగిసే సమయానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినప్పటికీ, మరి కొన్ని డౌట్లు దర్శకుడు అలాగే వదిలేశారు. దీంతో కథ పూర్తిగా ముగిసిన ఫీలింగ్ కంటే, మరో పార్టుకు సిద్ధం చేసినట్లు అనిపించిందని పలువురు ప్రేక్షకులు చెబుతున్నారు.

నిజానికి దృశ్యం 2 విడుదలైన తర్వాత కథను ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందా అనే చర్చ మొదలైంది. ఒకే కేసు చుట్టూ తిరిగే కథను పదేపదే విస్తరించడం వల్ల ఆసక్తి తగ్గిపోతుందనే అభిప్రాయాలు వినిపించాయి. అయినప్పటికీ జీతూ జోసెఫ్ మూడో పార్ట్ తీశారు. కానీ ఇప్పుడు మూడో పార్ట్ కూడా ఓపెన్ ఎండింగ్‌ తో ముగియడంతో విమర్శలు మళ్లీ మొదలయ్యాయి.

సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఇప్పటికే దర్శకుడిపై సెటైర్లు వేశారు. దృశ్యం ఫ్రాంచైజీని ఎప్పటికీ ముగించకుండా కొనసాగించాలని చూస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం జార్జ్‌ కుట్టి పాత్రకు ఎండింగ్ రాలేదని, నాలుగో పార్టు రావాలని కోరుకుంటున్నారు. వారి అభిప్రాయం ప్రకారం కథను ఇక్కడితో ఆపేస్తే ఇన్ కంప్లీట్ గా మిగిలిపోతుంది.

అదే సమయంలో జీతూ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. స్ట్రాంగ్ స్టోరీ దొరికితేనే దృశ్యం 4 గురించి ఆలోచిస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నాలుగో భాగంపై ఎలాంటి నిర్ణయం లేదని చెప్పినా, ఫ్రాంఛైజీని మాత్రం ఎండ్ చేయలేదు. అందుకే ఇప్పుడు సినీ ప్రియుల్లో దృశ్యం ఫ్రాంచైజీకి నిజమైన ఎండింగ్ లేనట్లేనా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

Tags:    

Similar News