రేర్ ఫీట్ ను సాధించిన మోహ‌న్ లాల్

ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా మోహ‌న్ లాల్ యంగ్ హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తూ మ‌ల‌యాళ ఆడియ‌న్స్ తో పాటూ తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా మెప్పిస్తూ వ‌స్తున్నాడు.;

Update: 2025-04-30 03:53 GMT

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేసి ఎంతోమంది ప్రేక్ష‌కుల్ని సంపాదించుకున్నాడు. మోహ‌న్ లాల్ సృష్టించిన రికార్డులు, ఆయ‌న సాధించిన ఫీట్లు మామూలువి కావు. రీసెంట్ గా ఎల్‌2 ఎంపురాన్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మోహ‌న్ లాల్, ఆ సినిమాతో మ‌ల‌యాళంలో రికార్డులు సృష్టించాడు. ఎల్2 ఎంపురాన్ త‌ర్వాత మోహ‌న్ లాల్ నుంచి మ‌రో సినిమా వ‌చ్చింది. అదే తుద‌రుమ్.

ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా మోహ‌న్ లాల్ యంగ్ హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తూ మ‌ల‌యాళ ఆడియ‌న్స్ తో పాటూ తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా మెప్పిస్తూ వ‌స్తున్నాడు. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ వాటితో రికార్డులు సృష్టిస్తున్న మోహ‌న్ లాల్ ఇప్పుడు మ‌రో అరుదైన రికార్డును సాధించాడు. కేర‌ళ‌లో మొద‌టి నాలుగు రోజుల్లో అత్య‌ధిక ఆడియ‌న్స్ ను సొంతం చేసుకున్న సినిమాలు మూడు ఉండ‌గా, ఆ మూడు సినిమాలూ మోహ‌న్‌లాల్‌వే అవ‌డం విశేషం.

టాప్3లో మొద‌టిగా ఎల్2: ఎంపురాన్ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమాను మొద‌టి నాలుగు రోజుల్లో ఏకంగా 25. 65 ల‌క్ష‌ల మంది సంద‌ర్శించారు. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుని సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ లూసిఫ‌ర్ కు సీక్వెల్ గా తెరకెక్కింది.

ఇక రెండో స్థానంలో లూసిఫ‌ర్ సినిమా ఉంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనే తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన టైమ్ లో మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో సెన్సేష‌న్ సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీని మొద‌టి నాలుగు రోజుల్లో 18 ల‌క్ష‌ల మంది సంద‌ర్శ‌కులు వీక్షించారు. ఈ సినిమాను తెలుగులో గాడ్ ఫాద‌ర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశాడు. ఇక మూడో ప్లేస్ లో తుద‌రుమ్ సినిమాను 17 ల‌క్ష‌ల మంది సంద‌ర్శ‌కులు వీక్షించారు. మోహ‌న్ లాల్ ఈ అరుదైన ఫీట్ ను సాధించడం ప‌ట్ల ఆయ‌న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Tags:    

Similar News