• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ద‌ర్శక సంఘానికి మోహన్...

ద‌ర్శక సంఘానికి మోహన్ బాబు భారీ విరాళం.. ఒక‌రికి ఉచిత విద్య‌ హామీ

| టాలీవుడ్ సీనియర్ నటుడు, `కలెక్షన్ కింగ్` డా. మంచు మోహన్ బాబు తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు.

By - Sivaji Kontham
Update: 2026-05-05 06:20 GMT

టాలీవుడ్ సీనియర్ నటుడు, `కలెక్షన్ కింగ్` డా. మంచు మోహన్ బాబు తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి (టిఎఫ్‌డిఏ) ఆయన 15 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వేదికపై సీనియ‌ర్ న‌టుడి వ్యాఖ్యలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.

మోహన్ బాబు మాట్లాడుతూ.. కేవలం ఆర్థిక సాయమే కాకుండా.. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటున్నానని తెలిపారు దర్శక సంఘం నుంచి ప్రతి ఏటా ఒక పేద విద్యార్థిని నా వద్దకు పంపించండి. తిరుపతిలోని మా విద్యాసంస్థ (శ్రీ విద్యానికేతన్) లో ఆ విద్యార్థికి 6వ తరగతి నుంచి ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. వారికి విద్యాబుద్ధులు నేర్పించి, ప్రయోజకులను చేసే బాధ్యత నాది! అని ఆయన మాట ఇచ్చారు.

గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ద్వారా కూడా పలువురు విద్యార్థులను తాను చదివించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంలో తన విద్యాసంస్థలు ఎప్పుడూ ముందుంటాయని.. చిత్ర పరిశ్రమలోని నిరుపేద కుటుంబాలకు అండగా ఉండటమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మోహన్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం పై దర్శకుల సంఘం ప్రతినిధులు.. సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యాదానం - తరతరాల తలరాతను మార్చే అస్త్రం

సినిమా రంగంలోని ప్రముఖులు ఇచ్చే తక్షణ ఆర్థిక సాయం ఒక కుటుంబం తాత్కాలిక అవసరాలను మాత్రమే తీరుస్తుంది. కానీ మోహన్ బాబు ప్రకటించిన విధంగా విద్యాదానం చేయడం వల్ల ఆ ప్రభావం కేవలం ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాకుండా.. ఆ కుటుంబం సామాజిక, ఆర్థిక స్థితిగతులనే శాశ్వతంగా మారుస్తుంది. ఒక పేద సినీ కార్మికుడి బిడ్డ ఇంజనీరో లేదా మరో ఉన్నత విద్యావంతుడో అయితే ఆ కుటుంబం పేదరిక చక్రం నుండి బయటపడటమే కాకుండా.. సమాజంలో గౌరవప్రదమైన హోదాను పొందుతుంది. విద్య ద్వారా లభించే జ్ఞానం, నైపుణ్యాలు ఆ కుటుంబంలోని తర్వాతి తరాలకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి.

ఇలాంటి విద్యా కార్యక్రమాలు చిత్ర పరిశ్రమలోని కార్మికులలో ఒక భరోసాను నింపుతాయి. తమ వృత్తిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉందనే ధీమా వారిలో చేసే పనిపై మరింత నిబద్ధతను పెంచుతుంది. ఒక విద్యార్థిని 6వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు చదివించడం అంటే.. ఒక వ్యక్తిని పూర్తిస్థాయిలో సమాజానికి ఉపయోగపడే ఆస్తిగా తీర్చిదిద్దడమే. సినీ ప్రముఖులు ఇలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలున్న సహాయ కార్యక్రమాలను చేపట్టినప్పుడు.. అది కేవలం ఒక విరాళంగా మిగిలిపోకుండా.. ఒక గొప్ప సామాజిక మార్పున‌కు పునాది అవుతుంది.

ఈ మార్పు మీ వ‌ల్లే రావాలి:

సినిమా రంగంలోని అగ్ర నిర్మాణ‌ సంస్థలు, ప్రముఖ నటులు వ్యక్తిగత సాయంతో ఆగిపోకుండా విద్యా, వైద్య రంగాలలో వ్యవస్థీకృతమైన సహాయాన్ని అందిస్తే సినీ కార్మికుల జీవన ప్రమాణాలు సమూలంగా మెరుగుపడతాయి. సాధారణంగా సినిమా కార్మికుల ఆదాయం నాన్ గ్యారెంటీతో ఉంటుంది కాబట్టి వారి సంపాదనలో సింహభాగం పిల్లల చదువులకు, అనారోగ్య సమస్యలకే ఖర్చవుతుంటుంది. ఒక క్రమబద్ధమైన విద్యా పథకం లేదా కార్పొరేట్ తరహా వైద్య భీమా సౌకర్యం అందరికీ అందుబాటులోకి వస్తే.. ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి వారి పొదుపు పెరుగుతుంది. ఇది కేవలం వారి జీవన నాణ్యతను పెంచడమే కాకుండా.. వారి పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి బలమైన పునాది వేస్తుంది. తద్వారా చిత్ర పరిశ్రమ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు..అసంఘ‌టిత రంగం మాత్ర‌మే కాదు.. తనను నమ్ముకున్న వారిని గౌరవంగా కాపాడుకునే ఒక బాధ్యతాయుతమైన వ్యవస్థ అనే నమ్మకం బలపడుతుంది.

Tags:    
  • manchumohanbabu 
  • tollywood 
  • educationdonation 
  • vidyadaanam 
  • telugucinema 
  • tfda 
  • mohanbabucharity 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS