ది ప్యారడైజ్ కోసం 120 డేస్.. ఏం ప్లాన్ చేస్తున్నాడో..?
న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు.;
న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. దసరా తర్వాత అదే కాంబినేషన్ అదే నిర్మాత ఈసారి భారీ అటెంప్ట్ చేస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల మీద ఉన్న కాన్ఫిడెంట్ ఏంటన్నది సినిమాకు పెడుతున్న బడ్జెట్ ని బట్టి తెలుస్తుంది. నాని అయితే ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఐతే ది ప్యారడైజ్ సినిమాలో నాని జడల్ గా డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నారు.
ది ప్యారడైజ్ మాలిక్ పాత్రలో మోహన్ బాబు..
ఈ సినిమాలో విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో మోహన్ బాబు షికంజ మాలిక్ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ టీం తో మోహన్ బాబు వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ బాగుందని టాక్. అంతేకాదు నాని సినిమాలో విలన్ రోల్ అది కూడా మోహన్ బాబు లాంటి స్టార్ యాక్టర్ నటించడం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. మోహన్ బాబు ది ప్యారడైజ్ కోసం మంచి సపోర్ట్ చేస్తున్నారట.
ది ప్యారడైజ్ కోసం మోహన్ బాబు దాదాపు 120 డేస్ దాకా కాల్ షీట్ ఇచ్చారట. ఈమధ్య మోహన్ బాబు పెద్దగా సినిమాలు చేయట్లేదు. అంతకుముందు ప్రతినాయకుడి రోల్స్ అయినా ఓకే అన్నారు కానీ తన ఇమేజ్ కి తగ్గట్టు రోల్స్ రావట్లేదని గ్యాప్ తీసుకున్నారు. ఈమధ్యనే కన్నప్ప సినిమాలో నటించిన మోహన్ బాబు మళ్లీ నాని సినిమాతో విలనిజం చూపించనున్నారు. ప్యారడైజ్ లో మిగతా అంశాలతో పాటు మోహన్ బాబు విలనిజం కూడా హైలెట్ అంటున్నారు.
దసరాని మించిన సినిమా..
ఇక నాని తో మోహన్ బాబు సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. 2026 మార్చి 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. మోహన్ బాబు తో పాటు బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల దసరా తో సెన్సేషనల్ హిట్ అందుకోగా ఈసారి దాన్ని మించిన సినిమాతో రాబోతున్నాడని తెలుస్తుంది. మరి నాని మోహన్ బాబు కాంబో ఎలా ఉంటుంది.. స్క్రీన్ మీద ఈ కాంబినేషన్ సీన్స్ ఎలాంటి జోష్ తెస్తాయన్నది చూడాలి.
మోహన్ బాబు కూడా ది ప్యారడైజ్ తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆఫ్టర్ గ్యాప్ మోహన్ బాబు ప్రతినాయకుడిగా ఎలా మెప్పిస్తారన్నది చూడాలని ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ది ప్యారడైజ్ విషయంలో నాని కేవలం హీరోగానే కాదు సినిమాకు అన్నీ తానై నడిపిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో కూడా నాని తన హిట్ మేనియా కొనసాగిస్తాడని అంటున్నారు.