వీడియో : AI తో బతికి వచ్చిన లెజెండ్రీ సింగర్
మానవ జీవితంలో ఇంటర్నెట్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ఇంటర్నెట్‌ను మించిన మార్పు ఏమీ ఉండదని అంతా అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఏఐ వచ్చి మొత్తం మార్చేస్తోంది.;
మానవ జీవితంలో ఇంటర్నెట్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ఇంటర్నెట్‌ను మించిన మార్పు ఏమీ ఉండదని అంతా అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఏఐ వచ్చి మొత్తం మార్చేస్తోంది. చనిపోయిన వారిని మన ముందుకు తీసుకు వస్తుంది, వేలాది మంది చేసే పనిని ఒకే ఒక్క గంటలో చేస్తుంది. ఇంకా ఏఐ గురించి చెబుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఏఐతో మంచితో పాటు కొందరు చెడు చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. మొత్తానికి ఏఐ వల్ల అద్భుతాలు ఆవిష్కారం అవుతున్నాయి. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన వారిని తీసుకు రావడంతో చాలా మంది మొహాల్లో ఆనందం, భావోద్వేగం చూడగలుగుతున్నాం. చనిపోయిన లెజెండ్స్‌ను మళ్లీ స్క్రీన్ పై ఏఐ టెక్నాలజీ సాయంతో చూడగలం అని ఇప్పటికే చాలా మంది నమ్మకంగా ఉన్నారు.
ఏఐ టెక్నాలజీతో మహమ్మద్ రఫీ పాట..
తాజాగా ఒక లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో చనిపోయిన ది లెజెండ్రీ సింగర్ మహ్మద్ రఫీని తీసుకు వచ్చారు. అంతే కాకుండా మహ్మద్ రఫీ పాట పాడినట్లుగానూ చూపించడంతో ఆయన అభిమానులు భావోద్వేగానికి గురి అయ్యారు. ఆయన గొంతును ఇప్పటికే ఏఐ ద్వారా క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన వీడియోను స్క్రీన్ పై ప్లే చేస్తూ ఏఐతో క్రియేట్ చేసిన ఆయన వాయిస్ సాంగ్‌ను జోడించడం ద్వారా ఆయన స్వయంగా పాడినట్లుగా అనిపించిందని అంతా అంటున్నారు. మహ్మద్ రఫీ ని ఏఐ లో క్రియేట్ చేసి ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ తన లైవ్ కాన్సర్ట్ లో డ్యూయెట్ పాడి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇది మహ్మద్ రఫీకి తాను ఇస్తున్న నివాళి అంటూ సోనూ నిగమ్ లైవ్ కాన్సర్ట్‌లో పాల్గొన్న అందరికి అదిరిపోయే కానుక ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సోనూ నిగమ్ పాటతో సర్‌ప్రైజ్
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోనూ నిగమ్ లైవ్ కాన్సర్ట్ ను నిర్వహించాడు. ప్రేక్షకులు భారీ ఎత్తున తరలి వచ్చారు. సోనూ నిగమ్ పై ఉన్న అభిమానంతో ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి రావడంతో కార్యక్రమం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కార్యక్రమంలో మహమ్మద్ రఫీని ఏఐ ద్వారా తీసుకు రావడంతో కార్యక్రమం మరింత విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనూనిగమ్ పై ఉన్న అభిమానం, గౌరవం దీంతో మరింతగా పెరిగిందని కూడా కొందరు మాట్లాడుతున్నారు. మహ్మద్ రఫీ వంటి లెజెండ్రీ సింగర్‌తో డ్యూయెట్ పాడటం సాధారణ విషయం కాదు, అలాంటిది ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన్ను ఏఐ లో రీ క్రియేట్ చేసి మరీ డ్యూయెట్ పాడటం ద్వారా సోనూ నిగమ్ అందరి దృష్టిని ఆకర్షించాడు అంటూ బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
టాలీవుడ్‌లోనూ సోనూ నిగమ్ పాటలు
సోనూ నిగమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అనే విషయం తెల్సిందే. ఎన్నో తెలుగు పాటలను పాడటం ద్వారా పరిచయం అయ్యాడు. ముఖ్యంగా ఆయన పాడిన కొన్ని పాటలు తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎప్పటికీ గుర్తు ఉండేలా చేశాయి. గోపాల గోపాల, ప్రాణం, అడవి రాముడు వంటి సినిమాల్లో అతడి గాత్రం ఆకట్టుకుంది. ఆయన ఎక్కువగా హిందీ పాటలకు పరిమితం అయ్యాడు. తిరిగి సౌత్ లో ఆయన పాడటం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సోనూ నిగమ్ లైవ్ కాన్సర్ట్‌లు ఎక్కడ నిర్వహించిన పెద్ద ఎత్తున ఆధరణ లభిస్తూ ఉంటుంది. తాజాగా రఫీ ని తీసుకు వచ్చి, డ్యూయెట్ పాడటంతో మరింతగా ఆయన కాన్సర్ట్ గురించి చర్చ జరిగింది. తద్వారా సోనూ నిగమ్ ముందు ముందు లైవ్ కాన్సర్ట్ అంటే కచ్చితంగా ఇలాంటివి ఉంటాయి కనుక మిస్ కావద్దని చాలా మంది మ్యూజిక్ ఆడియన్స్ అనుకునే అవకాశం ఉంది. దాంతో ఆయన తదుపరి కాన్సర్ట్ మరింత విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.