దీపావళి కంటే ముందు నవ్వుల పండగ.. ‘మిత్ర మండలి’ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్
ప్రీమియర్లకు వస్తున్న అద్భుతమైన స్పందనతో షోల సంఖ్య పెంచుతున్నామని, విజయవాడ, వైజాగ్‌లోనూ డిమాండ్ భారీగా ఉందని తెలిపారు.;
ఒక సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మేకర్స్ కొన్ని డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. ‘మిత్ర మండలి’ టీమ్ సరిగ్గా అదే చేసింది. అక్టోబర్ 16న అధికారికంగా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, ఒక రోజు ముందే అక్టోబర్ 15న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వంటి భారీ కామెడీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమనే ధీమాతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ ని చూపించారు. "దీపావళి పండగ 21న కావచ్చు, కానీ అసలైన నవ్వుల పండగ మా సినిమా ప్రీమియర్లతో ఈ రోజు సాయంత్రమే మొదలవుతుంది. అందరూ మీ కుటుంబాలతో కలిసి సినిమాకు రండి. రెండు గంటల పాటు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నవ్వించి బయటకు పంపిస్తామని గ్యారెంటీ ఇస్తున్నా" అని అన్నారు.
ప్రీమియర్లకు వస్తున్న అద్భుతమైన స్పందనతో షోల సంఖ్య పెంచుతున్నామని, విజయవాడ, వైజాగ్‌లోనూ డిమాండ్ భారీగా ఉందని తెలిపారు. ఈ మౌత్ టాక్ సినిమాకు మరింత మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, "ఈ సినిమా మీమర్స్‌కు, ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది. ఒక ఫ్రెష్ కామెడీతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమా కోసం నేను కొన్ని డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు అసలైన హీరో బన్నీ వాస్ గారే. గత పది రోజులుగా ఆయన నిద్రపోకుండా మా కోసం కష్టపడుతున్నారు" అని నిర్మాతపై ప్రశంసలు కురిపించారు.
ఇక తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్న సోషల్ మీడియా స్టార్ నిహారిక ఎన్ఎం మాట్లాడుతూ, "తెలుగులో ఇదే నా మొదటి సినిమా. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు టీమ్‌కు థాంక్స్. సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రతీ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అని నమ్ముతున్నాము" అని తన ఎగ్జైట్‌మెంట్‌ను పంచుకుంది.
దర్శకుడు విజయేందర్ మాట్లాడుతూ, "ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌ను హ్యాండిల్ చేయడం నా మొదటి సినిమాకు కాస్త కష్టంగా అనిపించినా, బన్నీ వాస్ గారి సపోర్ట్‌తో పూర్తి చేయగలిగాను" అని తెలిపారు. కథ విన్న నాలుగు గంటల పాటు తాను నవ్వుతూనే ఉన్నానని, సినిమాలో కొన్ని సరదా సెటైర్లు ఉన్నా, ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని బన్నీ వాస్ స్పష్టం చేశారు. భారీ తారాగణం, ఇండస్ట్రీ స్ట్రైక్స్ వంటి కారణాలతో బడ్జెట్ పెరిగినా, సినిమా అన్ని విధాలా లాభాలు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. మరి సినిమా ఆడియెన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.