మిరాయ్ లో అన్ని CG షాట్సా? అందుకే పోస్ట్ పోనా?
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తేజ.. ఇప్పుడు హీరోగా మారి విభిన్న కథలను ఎంచుకుంటూ సందడి చేస్తున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి డిఫరెంట్ కథలతో హిట్స్ అందుకున్నారు. హనుమాన్ మూవీతో ఏకంగా రూ.300 కోట్ల హిట్ ను సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ మూవీతో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి థియేటర్స్ లో సందడి చేయనున్నారు. సృష్టిని కాపాడే తొమ్మిది గ్రంథాలు, వాటిని చేజిక్కించుకోవడానికి దృష్ట శక్తి ప్రయత్నం.. దాని ఆపేందుకు హీరో చేసే సాహసాలే సినిమా కథ అని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచేసింది.
అయితే రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఏ రేంజ్ లో ఉండనుందో మేకర్స్ రుచి చూపించారు. ముఖ్యంగా గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ వర్క్స్ కు అంతా ఫిదా అయ్యారు. హీరో వెంట ఉండే గరుడ పక్షి విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. ట్రైలర్ లోని విజువల్స్ ఆడియన్స్ ను పేక్షకులను మెప్పిస్తున్నాయి.
మొత్తానికి సీజీ, వీఎఫ్ ఎక్స్ వర్క్ అదిరిపోయాయని అంతా చెబుతున్నారు. సినిమాలో వీఎఫ్ ఎక్స్ కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. ఆడియన్స్ కు కొత్త లోకాలను పరిచయం చేయడం, వారిని థ్రిల్ చేయడం కోసం గ్రాఫిక్స్ మీద మేకర్స్ ఆధారపడ్డారని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు అనుగుణంగా గ్రాఫిక్స్ షాట్స్ ను డిజైన్ చేశారు.
అయితే ఇప్పుడు సినిమాలో 1650 వీఎఫ్ ఎక్స్/ సీజీ షాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు చాలా షాట్స్ కు చెందిన వర్క్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ఇంకా కొన్ని షాట్స్ కు సంబంధించిన పని పెండింగ్ ఉందని వినికిడి. మరో రెండు మూడు రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.
అవి వచ్చాక వాటిని మేకర్స్ చెక్ చేసి.. అప్ టు ది మార్క్ ఉండేలా చేసుకుంటారు. సౌండ్ వర్క్ ను ఫినిష్ చేసి ఫైనల్ కాపీ సిద్ధం చేయనున్నారు. అయితే మూవీ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఆ షాట్స్ అని సమాచారం. ఇప్పటికే పని పూర్తి అయిపోతుందని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల కాస్త లేట్ అయినట్లు తెలుస్తోంది. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.