USలో మిరాయ్ దూకుడు .. కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ సంగతేంటి?

రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. వివిధ చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ హై లెవెల్ లో సందడి చేస్తోంది.;

Update: 2025-09-15 06:31 GMT

యంగ్ హీరో తేజ్ సజ్జా మిరాయ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా వాటిని అందుకుని సత్తా చాటుతోంది. ఓ రేంజ్ లో వసూళ్లు కురిపిస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. వివిధ చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ హై లెవెల్ లో సందడి చేస్తోంది.

ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 1.7 మిలియన్లు వసూలు చేసి భారీ హిట్‌ గా నిలిచింది. గురువారం ప్రీమియర్ల నుంచి $400K, శుక్రవారం నుంచి $375Kతో ఆశాజనకంగా ప్రారంభమైన మిరాయ్.. శనివారం నాడు $564K వసూలు చేసి విధ్వంసం సృష్టించింది.

చాలా కాలం తర్వాత ఉత్తర అమెరికాలో తెలుగు చిత్రానికి ఇది అతిపెద్ద శనివారంగా నిలిచింది. ఇప్పుడు ఆదివారం వసూళ్లు $350K - $400K మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫస్ట్ వీకెండ్ నాటికి మొత్తం $1.7 మిలియన్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో నార్త్ యూఎస్ లో మిరాయ్ దూకుడు వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి.

అయితే గత వారం రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్కు వైపు పయనిస్తోంది. కొత్త విడుదలలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం రెండో వీకెండ్ లో కూడా అద్భుతమైన వసూళ్లను వసూలు చేయగలిగింది. ఆదివారం ముగిసిన తర్వాత మొత్తం వసూళ్లు $875K కు దగ్గరగా ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దీంతో చిన్న చిత్రం.. ప్రతిష్టాత్మక మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే అరుదైన ఘనత అవుతుంది. అదే సమయంలో మిరాయ్ తోపాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హారర్ ఎంటర్టైనర్ కిష్కింధపురి మూవీ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఆ సినిమా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఓవర్సీస్ లో కలెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకుంటోంది. ఫస్ట్ వీకెండ్ లో దాదాపు $175K వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మెల్లగా పుంజుకుంటోంది. మలయాళ బ్లాక్ బస్టర్ లోక చాప్టర్:1 చంద్ర కూడా ఓవర్సీస్ లో $2 మిలియన్ల మార్కును దగ్గరగా ఉంది. మొత్తానికి నార్త్ యూఎస్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు చిత్రాలు సత్తా చాటుతున్నాయి.

Tags:    

Similar News