మైకేల్ జాక్సన్ సంగీతం అందించినా పేరు ఎందుకు వేసుకోలేదు?

1993లో పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ -సెగా సంస్థ రూపొందించిన సోనిక్ ది హెడ్జ్‌హాగ్ 3 అనే బ్లాక్‌బస్టర్ వీడియో గేమ్‌ కోసం రహస్యంగా సంగీతాన్ని స్వరపరిచారు.

Update: 2026-10-14 02:30 GMT

1993లో పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ -సెగా సంస్థ రూపొందించిన సోనిక్ ది హెడ్జ్‌హాగ్ 3 అనే బ్లాక్‌బస్టర్ వీడియో గేమ్‌ కోసం రహస్యంగా సంగీతాన్ని స్వరపరిచారు. అయినా? ఆ గేమ్‌ విడుదలైనప్పుడు అధికారిక క్రెడిట్స్‌లో జాక్స‌న్ పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ రహస్య కాంబినేషన్ గేమింగ్ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.

సెగా సంస్థతో జాక్సన్ అనుబంధం:

మైకేల్ జాక్సన్‌కు సోనిక్ వీడియో గేమ్ సిరీస్ అంటే? ఎంతో ఇష్టం ఉండేది. అంతకుముందే 1990లో ఆయన నటించిన మూన్‌వాకర్ సినిమా ఆధారంగా సెగా సంస్థ ఆర్కేడ్ గేమ్‌ను రూపొందించడంతో.. జాక్స‌న్కు ఆ కంపెనీతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ఇష్టంతోనే 1993లో డేంజరస్ వరల్డ్ టూర్ సమయంలో కాలిఫోర్నియాలోని సెగా డెవలప్‌మెంట్ స్టూడియోను సందర్శించిన ఆయన సోనిక్ 3 గేమ్‌కు సంగీతం అందించేందుకు ముందుకు వచ్చారు.

క్రెడిట్స్ నుంచి పేరు తొలగింపుకు కారణం:

పాప్ కింగ్ పేరు ఈ గేమ్‌లో లేకపోవడానికి ఆడియో క్వాలిటీ ప్రధాన కారణమని ఆయనతో కలిసి పనిచేసిన సహ-సంగీత దర్శకుడు బ్రాడ్ బక్సర్ వెల్లడించారు. అప్పట్లో సెగా జెనెసిస్ కన్సోల్‌లో ఉపయోగించిన సౌండ్ చిప్ సాంకేతిక పరిమితుల వల్ల తాను స్వరపరిచిన సంగీతంలోని తీవ్రత , నాణ్యత సరిగ్గా రావట్లేదని జాక్సన్ అసంతృప్తి చెందారు. ఆడియో క్వాలిటీ తగ్గడం తో తన సంగీత ప్రామాణికత దెబ్బతింటుందని భావించి, క్రెడిట్స్ నుండి తన పేరును తొలగించాలని జాక్స‌న్ కోరారు.

సోనిక్ 3 ఘన విజయం:

1994లో విడుదలైన సోనిక్ ది హెడ్జ్‌హాగ్ 3 గేమ్ గేమింగ్ రంధ్రంలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ప్రతులు అమ్ముడై అత్యంత ఆదరణ పొందింది. ఆడియో నాణ్యతపై జాక్సన్ అసంతృప్తి వ్యక్తం చేసినా? ఆయన స్వరపరిచిన ట్యూన్లు , స్వరకల్పన ఆలోచనలు గేమ్‌లోని ఆఖరి వెర్షన్‌లో భాగమయ్యాయని డెవలపర్లు స్పష్టం చేశారు.

సూపర్ హిట్ పాటలకు బీజం:

ఈ గేమ్‌ కోసం జాక్సన్ స్వరపరిచిన మ్యూజిక్ థీమ్‌లు తరువాత ఆయన సొంత‌ ఆల్బమ్‌లలో కూడా ఉపయో గపడ్డాయి. ముఖ్యంగా సోనిక్ 3 గేమ్‌లోని ఎండ్-క్రెడిట్స్ థీమ్‌లోని మ్యూజిక్ కార్డ్స్, జాక్సన్ 1996లో విడుదల చేసిన ప్రసిద్ధ స్ట్రేంజర్ ఇన్ మోస్కో పాట రూపకల్పనకు పునాదిగా నిలిచాయని బక్సర్ తెలిపారు. ఈ పాట ఆయన 9వ స్టూడియో ఆల్బమ్ హిస్ట‌రీలో భారీ ప్రాచుర్యం పొందింది.

వివాదాలు -వివాదాస్పద కథనాలు:

జాక్సన్ పేరు క్రెడిట్స్‌లో లేకపోవడంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సెగా మాజీ ఎగ్జిక్యూటివ్ రోజర్ హెక్టర్ మాటల ప్రకారం అప్పట్లో జాక్సన్‌పై వచ్చిన కొన్ని వివాదాల కారణంగా ఆయన సంగీతాన్ని తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే బ్రాడ్ బక్సర్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. కేవలం సాంకేతిక పరిమితులు - ఆడియో నాణ్యత నచ్చకనే జాక్సన్ స్వయంగా తన పేరును క్రెడిట్స్ నుండి తీయించుకున్నార‌ని.. ఆయన అందించిన ఈగెల్ మ్యూజిక్ గేమ్‌లోనే ఉండిపోయిందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News