ఎట్టకేలకు ఫ్రీ గా అందుబాటులోకి సూపర్ హిట్ మూవీ..!
థియేట్రికల్ రన్ సూపర్ హిట్‌గా ఉన్న సమయంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం ద్వారా కొత్త ఆదాయ మార్గం అనుకుంటున్నారు.;
ఈ మధ్య కాలంలో థియేట్రికల్ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న హాలీవుడ్ సినిమాలను వెంటనే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఓటీటీలో చూడాలి అంటే సబ్‌స్క్రైబర్స్ సైతం అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని ఇండియన్ సినిమాలు ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. కానీ హాలీవుడ్‌లో ఎక్కువ శాతం ఇదే తరహాలో సినిమాల యొక్క మార్కెటింగ్ జరుగుతుంది. థియేట్రికల్ రన్ సూపర్ హిట్‌గా ఉన్న సమయంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం ద్వారా కొత్త ఆదాయ మార్గం అనుకుంటున్నారు. కొన్ని ఓటీటీలో అద్దె ప్రాతిపదికన కొన్ని వారాలు మాత్రమే నడుస్తాయి. ఆ తర్వాత రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్‌కి అందుబాటులోకి వస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం నెలల తరబడి ఓటీటీలో రెంట్ పద్దతిలోనే స్ట్రీమింగ్ కావడం మనం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం.
జియో హాట్‌స్టార్‌లో సిన్నర్ మూవీ
హాలీవుడ్ మూవీ 'సిన్నర్' సినిమా వచ్చి చాలా నెలలు అవుతోంది. దాదాపు అయిదు నెలల పాటు ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ అయిన కొన్ని వారాలకే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేశారు. కానీ అమెజాన్‌లో ఈ సినిమాను చూడాలి అంటే దాదాపుగా రూ.150 లు చెల్లించాల్సి ఉంది. ఈ సినిమాను చూడ్డానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటికే సినిమాను జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందాలు జరిగాయి. జియో హాట్ స్టార్‌లో రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్‌కి స్పిన్నర్ సినిమాను అందుబాటులో ఉంచబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దాంతో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తూ వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ నుంచి జియో హాట్‌స్టార్‌కి..
ఓటీటీలో ఈ సినిమాను అందరికీ అందుబాటులో సెప్టెంబర్ 18 నుంచి ఉంచబోతున్నారు. జియో హాట్ స్టార్ నుంచి ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ ఓటీటీ సినిమాలను స్ట్రీమింగ్ చేసిన జియో హాట్ స్టార్‌లోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం ద్వారా అత్యధికంగా ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు రెంట్ పద్ధతి ఉన్న కారణంగా చాలా మందే సినిమాను చూడకుండా ఉన్నారు. ఇప్పుడు కొత్త పద్దతిలో సినిమాను తీసుకు రాబోతున్నారు కనుక వెంటనే భారీ ఎత్తున ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
మైఖేల్ బి జోర్డాన్ ప్రధాన పాత్రలో స్పిన్నర్
ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వచ్చిన ఈ హర్రర్ మూవీ 1932లో జరిగిన ఒక యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో మైఖేల్ బి జోర్డాన్ డ్యూయెల్ రోల్‌లో నటించాడు. ఈ సినిమాలో హైలీ స్టెయిన్‌ఫెల్డ్, మైల్స్ కాటన్, జాక్ ఓ'కానెల్, వున్మీ మొసాకు, జేమ్ లాసన్, ఒమర్ మిల్లర్ లు నటించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 18, 2025న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 366 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాల జాబితాలో ఈ సినిమా నిలిచింది. హాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా పలు ప్రపంచ దేశాల్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఉన్నారు.