మెగా హీరోల్లో అతడు స్పెషల్!
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు చేసినన్ని ప్రయోగాలు మరో మెగా హీరో చేయలేదు అన్నది అంతే వాస్తవం.;
మెగా హీరోల్లో వరుణ్ తేజ్ స్పెషల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు చేసినన్ని ప్రయోగాలు మరో మెగా హీరో చేయలేదు అన్నది అంతే వాస్తవం. ఓ నటుడిగా అన్ని రకాల జోనర్ చిత్రాలు చేయడం వరుణ్ కే చెల్లింది. ముఖ్యంగా సాహసాలు చేయడంలో వరుణ్ స్పెషలిస్ట్ అని కెరీర్ ఆరంభంలోనే నిరూపించుకున్నాడు. ఈ విషయంలో ఓ బ్రదర్ గా రామ్ చరణ్ కూడా అంతే గర్విస్తారు.
వరుణ్ డిఫరెంట్ జానర్ సినిమాలు చూసి తనకెంతో సంతోషం వేస్తుందని..అతడి డిఫరెంట్ ఐడియాలజీ తనకు ఎంతో నచ్చుతుందన్నారు చరణ్. `కంచె`, `అంతరిక్షం`, `గద్దలకొండ గణేష్`, `గాండీవధారి అర్జున`, `ఆపరేషన్ వాలెంటైన్` ,` మట్కా` ఇవన్నీ వరుణ్ కెరీర్ లో ప్రయోగాత్మక చిత్రాలే. `కంచె`లో దేశ భక్తితో పాటు అందమైన ప్రేమకథలో కనిపించాడు. `అంతరిక్షం` లాంటి కాన్సెప్ట్ లు కేవలం హాలీవుడ్, బాలీవుడ్ కే పరిమమైన రోజుల్లో మనకు అలాంటి సినిమా ఒకటి కావాలని వరుణ్ దైర్యం చేయడంతో అది సాధ్యమైంది.
తాను అప్పటికే స్టార్ గా ఫేమస్ అయిన `గద్దల కొండ గణేష్` లో వైవిథ్యమైన పాత్రతో ప్రేక్షకుల్ని అలరించాడు. అటుపై `అంతరిక్షం` ఫెయిలైనా `ఆపరేషన్ వాలైంటైన్` లో వింగ్ కమాండర్ గా కనిపిం చాడు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అంతరిక్షం తర్వాత వరుణ్ కెరీర్ లో మరో పెద్ద ప్రయోగం ఇది. ఇలాంటి సినిమాలు అప్పటి వరకూ టాలీవుడ్ లో ఏ నటుడు చేయలేదు. కనీసం ఆలోచన కూడా చేయలేదు.
కానీ వరుణ్ మాత్రం వాటి కోసం నేను ఉన్నానంటే ఓ కొత్త దర్శకుడి కథని నమ్మి చేసిన చిత్రమే `ఆపరేషన్ వాలెంటైన్`. నటుడిగా వరుణ్ స్థాయిని మార్చిన చిత్రమిది. అటుపై `మట్కా` అంటూ మరో ప్రయోగం. ఈ సారి ఆ ప్రయోగం ఏకంగా పాన్ ఇండియాలోనే చేసాడు. జూదం అనే కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాలోనూ వరుణ్ ఆహార్యం అంతా కొత్త అనుభూతిని పంచు తుంది. ఇలా మెగా హీరోల్లో ప్రయోగాలకు పెట్టింది పేరు ఎవరు? అంటే వరుణ్ తేజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.