చిరంజీవి 'మెగా 158'.. సూపర్ స్టార్ నటించడం లేదా?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓవైపు మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో మరికొద్ది రోజుల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతూనే.. మరోవైపు తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.;
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓవైపు మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో మరికొద్ది రోజుల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతూనే.. మరోవైపు తన అప్ కమింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితం చిత్రీకరణను మొదలుపెట్టి.. ఇప్పుడు శరవేగంగా నిర్వహిస్తోంది.
అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అప్పుడే మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటికే చిరు, బాబీ కొల్లి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు మెగా 158 ప్రాజెక్టుపై అంతా మంచి హోప్స్ పెట్టుకున్నారని చెప్పాలి.
అదే సమయంలో సినిమాలో స్పెషల్ క్యామియో రోల్ ను డిజైన్ చేశారట బాబీ కొల్లి. మూవీలో ఆ పాత్ర కీలకమని సమాచారం. మొత్తం కథను మలుపు తిప్పుతుందనేలా రాసుకున్నారని వినికిడి. ప్రేక్షకులకు మంచి కిక్కుతోపాటు సర్ప్రైజ్ ఇచ్చే పాత్రగా ల ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో ఆ రోల్ కోసం సరైన నటుడిని సెలెక్ట్ చేసేందుకు కొన్ని రోజులుగా చర్చలు జరుపుతోంది మూవీ టీమ్.
అందులో భాగంగా ఇటీవల మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. ఆయనతో చిరంజీవికి మంచి రిలేషన్ ఉండడంతో.. సినిమాలో కీలక పాత్రలో నటించాలని మేకర్స్ కోరారట. ఇప్పటివరకు మోహన్ లాల్, మెగాస్టార్ కలిసి వర్క్ చేయకపోవడంతో.. మెగా 158 ద్వారా అభిమానులకు, సినీ ప్రియులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని చూశారని వినికిడి.
అయితే ఆ క్యామియో రోల్ కోసం మోహన్ లాల్ ఏకంగా రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ అడిగినట్లు ఇప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి.. మోహన్ లాల్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా యాక్ట్ చేస్తారని మేకర్స్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన రూ.30 కోట్ల పారితోషికం అడగడంతో సైలెంట్ అయిపోయారని వార్తలు వస్తున్నాయి.
అందులో నిజమెంతో తెలియదు కానీ.. టాలీవుడ్ లో రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ అందరి హీరోలకే లేదు. కొందరు మాత్రమే ఆ రేంజ్ లో తీసుకుంటున్నారు. అలాంటిది క్యామియో రోల్ కే అంత మొత్తంలో ఇవ్వడమంటే మేకర్స్ కష్టమని భావించారని సమాచారం. అందుకే మరో నటుడి కోసం ఇప్పుడు చూస్తున్నారట. తక్కువ మొత్తానికి క్యామియో రోల్ చేసే నటుడిని ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు వినికిడి. మరి సినిమాలో ఆ స్పెషల్ క్యామియో రోల్ చివరకు ఎవరు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.