మీనాక్షికి ఈ ఏడాది అయినా లక్‌ కలిసి వచ్చేనా?

ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 కిరీటాన్ని గెలుచుకున్న మీనాక్షి చౌదరికి సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి.

Update: 2026-09-11 16:30 GMT

బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కి 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి అందంతో పాటు, అభినయం తో మెప్పించింది. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదటి రెండు ఏళ్లు మెల్లగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన మీనాక్షి చౌదరికి 2024లో జాక్ పాట్ తగిలినట్లుగా వరుస సినిమా ఆఫర్లు దక్కాయి. అందులో ఎక్కువ శాతం విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్‌ మీనాక్షి చౌదరికి స్టార్‌డం తెచ్చి పెట్టింది. ఇతర సినిమాల్లోనూ ఆమె అందం కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ ఏడాది చేసిన సినిమాల కారణంగా మీనాక్షి ముందు ముందు వరుస సినిమాలు చేయడం ఖాయం, ఏడాదికి రెండు మూడు సినిమాలతో మీనాక్షి టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ సందడి చేయడం ఖాయం అనుకున్నారు. కానీ సీన్‌ రివర్స్ అయింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం మినహా మరే సినిమా రాలేదు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి...

వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో మీనాక్షి చౌదరి చేసిన మీనూ పాత్ర సైతం అందరిని ఆకట్టుకుంది. అందం, అభినయంతో మీనాక్షి మెప్పించింది. ఆ సినిమా తర్వాత అయినా మీనాక్షికి ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ అంత పెద్ద హిట్‌ దక్కినా టాలీవుడ్‌ నుంచి ఈమెకు ఆఫర్లు రాలేదు. అంతకు ముందు ఎప్పుడో ప్రారంభం అయిన అనగనగా ఒక రాజు సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ప్రస్తుతం మీనాక్షి చేతిలో కేవలం నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న 'వృషకర్మ' సినిమా మాత్రమే ఉంది. గత రెండేళ్లుగా మేకింగ్‌లో ఉన్న వృషకర్మ ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ ను ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్‌ 4, 2026న విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

నాగ చైతన్య, కార్తీక్‌ వర్మ దండు సినిమా...

నాగ చైతన్య హీరోగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న వృషకర్మ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. సినిమాపై జనాల్లో ఇప్పటి వరకు బజ్ క్రియేట్‌ కాలేదు. దర్శకుడు కార్తీక్‌ వర్మ దండు ఒక మంచి కంటెంట్‌ ఓరియంటెడ్‌ మూవీని చేస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బిజినెస్ సైతం బాగా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి బజ్ ఉన్న సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా మీనాక్షి చౌదరికి తప్పకుండా బ్రేక్‌ దక్కుతుందనే విశ్వాసంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా మీనాక్షి చౌదరికి వర్కౌట్‌ కాకుంటే కెరీర్‌ ఖతం అయినట్లే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మీనాక్షి చౌదరి కొత్త సినిమాలు..

ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 కిరీటాన్ని గెలుచుకున్న మీనాక్షి చౌదరికి సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ కాలం కలిసి రాకపోవడంతో పాటు, అదృష్టం తనవైపు లేకపోవడంతో హిట్‌ పడ్డా ఆఫర్లు తలుపు తట్టడం లేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి సినిమా అంటే కేవలం వృషకర్మ మాత్రమే. మరే సినిమాలు లైన్‌లో లేవు, ఆ మధ్య ఒక తెలుగు నిర్మాతతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ హీరో విషయంలో తేడా రావడంతో ఆ సినిమా మొత్తానికి క్యాన్సల్‌ చేశారని పుకార్లు వినిపించాయి. ఎప్పటికి మీనాక్షి చౌదరి కొత్త తెలుగు సినిమా ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ్‌, హిందీ భాషల్లోనూ మీనాక్షి ప్రయత్నాలు చేస్తుంది. ఆడిషన్స్ కి సైతం హాజరు అవుతుందట. కానీ లక్‌ కలిసి రావడం లేదు. ఈ ఏడాదిలో వృషకర్మతో హిట్‌ కొడితే లక్ కలిసి వచ్చేనా చూడాలి.

Tags:    

Similar News