నార్త్ బ్యూటీ అయినా సౌత్ ప్రియురాలు!
మీనాక్షి చౌదరి కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అమ్మడు ఏ సినిమా చేసినా హిట్ లెక్క. దీంతో మీనాక్షి సక్సెస్ కి సెంటిమెంట్ గా మారిపోయింది.;
మీనాక్షి చౌదరి కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అమ్మడు ఏ సినిమా చేసినా హిట్ లెక్క. దీంతో మీనాక్షి సక్సెస్ కి సెంటిమెంట్ గా మారిపోయింది. ఈ ఏడాది 'సంక్రాతికి వస్తున్నాం'తో 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. ఏడాది తొలి సక్సస్ ఇదే. ప్రస్తుతం అమ్మడి లైనప్ లో రెండు...మూడు సినిమాలున్నాయి. ప్రస్తుతం ఫోకస్ అంతా తెలుగు పైనే పెట్టింది.
ఇతర భాషల్లో ప్రయత్నాలు చేయలేదు. మార్కెట్ ఉండటంతో? రిస్క్ తీసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మీనాక్షి ట్యాలెంట్ కి స్టార్ లీగ్ లో చేరడానికి పెద్దగా సమయం పట్టదు. అలాగే సౌత్ ని అమ్మడు మరింత వంట పట్టించుకుంటుంది. హర్యానా నుంచి దిగిన బ్యూటీ సౌత్ కల్చర్ కు బాగా అలవాటు పడు తుంది. డ్రెస్ ల్లో కంటే చీరల్లోనే ఎక్కవగా కనిపిస్తుంది. చపాతీ, రోటీ కంటే దోసెలే ఇష్టమంటోంది.
హైదరాబాద్లో ప్యావరెట్ స్పాట్ ఏది అంటే? ఠక్కున మరో ఆలోచన లేకుండా టీటీడీ అంది. నార్త్ బ్యూటీ లను అడిగితే రకరకాల ప్లేస్ లు చెప్పిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. టీటీడీ అంటే ఇష్టమని చెప్పింది చాలా తక్కువ. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇష్టమా? నార్త్ ఇండియన్ వంటకాలు ఇష్టమా? అంటే సౌత్ ఇండియన్ అనేసింది. పానీ పూరి ఇష్టమా? గోల్ గప్పా ఇష్టమా? అంటే తెలుగు వారు జుర్రేసే పానీ పూరి అంది.
చీర కట్టుకోవడం ఇష్టమా? మోడ్రన్ దుస్తులంటే ఇష్టమా? అని అడిగితే ఆలోచించకుండా చీర-రవిక అంది. ఇలా అన్నింటి సౌత్ పై అభిమానాన్ని చాటింది. ప్రస్తుతం మీనాక్షి యవ సామ్రాట్ నాచైతన్య 24వ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే 'అనగనగా ఒక రోజు' అనే మరో సినిమాలోనూ నటిస్తుంది.