సీనియర్ హీరోలతో చేయడానికేం ఇబ్బంది లేదు
నటీనటులన్న తర్వాత ఎవరైనా సరే ఎలాంటి పాత్రకైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే నటిగా తమ ప్రతిభ ఏంటనేది ఆడియన్స్ కు అర్థమవుతుంది.;
నటీనటులన్న తర్వాత ఎవరైనా సరే ఎలాంటి పాత్రకైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే నటిగా తమ ప్రతిభ ఏంటనేది ఆడియన్స్ కు అర్థమవుతుంది. అలా కాకుండా ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం చేస్తే నటిగా మంచి పేరు అందుకునే భాగ్యం కోల్పోయినట్టే అవుతుంది. అయితే కొన్నిసార్లు అదృష్టం బావుండటం వల్ల అవకాశాలొచ్చినా కొంతమందికి యాక్టర్లుగా మంచి పేరు మాత్రం రాదు.
అసలు విషయానికొస్తే ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి ఆ తర్వాత అడివి శేష్ తో కలిసి హిట్2 సినిమాలో నటించి మంచి హిట్ ను ఖాతాలో వేసుకుంది. హిట్2 సక్సెస్ తర్వాత మీనాక్షికి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టడంతో ఈ హర్యానీ భామ పలు సినిమాలతో బిజీగా మారిపోయింది.
వరుస సక్సెస్‌ల్లో మీనాక్షి
గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు సరసన సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి వరుస సక్సెస్‌లను నమోదు చేసుకుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి తన సినీ కెరీర్ గురించి, ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ఇకపై అలాంటి పాత్రలు చేయను
పెద్ద హీరోలతో కలిసి తాను చేసిన సినిమాలేమైనా ఫ్లాపైతే దానికి తనను బాధ్యురాలిని చేశారని చెప్పిన మీనాక్షి, లక్కీ భాస్కర్ మూవీలో ఓ పిల్లాడికి తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. లక్కీ భాస్కర్ కథ విపరీతంగా నచ్చడం వల్లే ఆ సినిమా చేశానని, కానీ ఇక మీదట పిల్లల తల్లిగా కనిపించే పాత్ర వస్తే మాత్రం మొహమాటం లేకుండా నో చెప్తానని చెప్తోంది మీనాక్షి.
రూమర్ల విషయంలో కోపమొస్తుంది
సీనియర్ హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి తనకెలాంటి సమస్యలూ లేవని చెప్తున్న ఈ ఆరడుగుల రెండు అంగుళాల భామ, అలా చేయాల్సి వస్తే దాన్ని ఓ కొత్త జానర్ గా భావిస్తానని తెలిపింది. వెంకీతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ చేశానని, చిరంజీవితో కలిసి విశ్వంభర చేయడం చాలా మంచి ఆఫర్ గా భావిస్తున్నట్టు పేర్కొంది. అయితే రూమర్ల విషయంలో మాత్రం తనకు చాలా కోపమొస్తుందని, తన గురించి ఏదైనా చెప్పాలంటే స్వయంగా తానే అనౌన్స్ చేస్తానని, తనకు సోషల్ మీడియా ఉందని చెప్పారు. సౌత్ ఇండియన్ కల్చర్ అంటే తనకెంతో ఇష్టమని చెప్తున్న మీనాక్షి, తన హైట్ కారణంగా అమ్మాయిలు కూడా తనతో మాట్లాడేందుకు ఎక్కువ ఇష్టపడేవారు కాదని చెప్పింది.