కేరళ ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చిన మీనాక్షి!
మీనాక్షి చౌదరి.. కుర్రకారు క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. ఈ మధ్యకాలంలో ఒకవైపు వరుస అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తోంది.
మీనాక్షి చౌదరి.. కుర్రకారు క్రష్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ చిన్నది.. ఈ మధ్యకాలంలో ఒకవైపు వరుస అవకాశాలు అందుకుంటూనే.. మరొకవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తోంది. 1996 మార్చి 5న పంచ్ కులా హర్యానాలో జన్మించిన ఈమె.. పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. ఇక తర్వాత నటనరంగం వైపు ఆసక్తితో మొదట మోడల్ గా మారింది. అలా మయన్మార్ - యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలలో పాల్గొని మొదటి రన్నరప్ గా నిలిచిన ఈమె..ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని దక్కించుకొని.. అదే ఏడాది మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ని కూడా దక్కించుకుంది.
మోడల్ గా తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటున్న సమయంలోనే.. 2019 లో హిందీ సినిమా అప్ స్టార్ట్ లు అనే చిత్రంలో హీరో స్నేహితురాలి పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె.. 2021లో అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో ఎస్ దర్శన్ దర్శకత్వం వహించిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకు మాత్రం గుర్తింపు వచ్చింది హిట్ : ది సెకండ్ కేస్ మూవీ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె 2024 లో గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అదే ఏడాది లక్కీ భాస్కర్ సినిమాలో నటించి మరో విజయాన్ని అందుకున్న ఈమె.. ఆ తర్వాత వరుసగా మట్కా, మెకానిక్ రాఖీ , సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమాతో మరో సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని సంక్రాంతి హీరోయిన్గా పేరు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్యతో వృషకర్మ సినిమాలో నటిస్తున్న మీనాక్షి.. అలాగే మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట మల్లిడి కాంబినేషన్లో వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తోంది. అలాగే కార్తీ 30 మూవీ తో పాటు ఫోర్స్ 3 అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇలా ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే తాజాగా క్లాసిక్ కేరళ కసవు చీర ధరించి ట్రెడిషనల్ లుక్ లో మరింత అందంగా ఆకట్టుకుంది. లేత తెలుపు/ క్రీమ్ కలర్ కాటన్ బేస్ కి మెరిసే గోల్డెన్ జరీ అంచు జతచేసిన చీరను కట్టుకొని చాలా సాంప్రదాయంగా కనిపించింది . ఆకుపచ్చ రంగు కలిగిన ఆఫ్ బ్లౌజును ధరించిన ఈమె.. ఈ ట్రెడిషనల్ లుక్ లో అభిమానులను మరింత గా ఆకట్టుకుంది. మొత్తానికి అయితే కేరళ ట్రెడిషనల్ లుక్ లో మీనాక్షి ఒదిగిపోయింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పైగా మీనాక్షి ఈ ఫోటోలకు క్యాప్షన్ గా "ట్రెండ్ కి తగ్గట్టు వెళ్తున్నాను" అంటూ కామెంట్లు చేసింది.