సితార.. ఒకవైపు తమిళ తంబీలు, మరోవైపు లక్కీ హీరోయిన్!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థ పేరు వినబడితే చాలు, అక్కడ ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉన్నట్టే లెక్క.;

Update: 2026-05-08 04:20 GMT

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థ పేరు వినబడితే చాలు, అక్కడ ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉన్నట్టే లెక్క. అదే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. నాగవంశీ సారథ్యంలో ఈ బ్యానర్ స్పీడ్ చూస్తుంటే ఇతర నిర్మాతలకు మైండ్ బ్లాక్ అవుతోంది. కేవలం మన తెలుగు హీరోలతోనే కాకుండా, పక్కింటి తమిళ హీరోలపై కూడా సితార గట్టిగానే కన్నేసింది. డబ్బింగ్ మార్కెట్‌ను దాటి నేరుగా మన ఊర్లోనే వారితో సినిమాలు తీస్తూ, తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసే ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే, ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ తీసి సక్సెస్ కొట్టిన సితార బ్యానర్, ఇప్పుడు సూర్య, కార్తి మీద ఫోకస్ పెట్టింది. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఇప్పటికే సెట్స్ మీద ఉంది. ఇక కార్తితో కూడా ఒక కొత్త సినిమాను మొదలుపెట్టారు.

‘మ్యాడ్’ సినిమాతో తన కామెడీ టైమింగ్‌ ఏంటో నిరూపించుకున్న కల్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తి లాంటి సహజ నటుడు, కల్యాణ్ శంకర్ మార్క్ హ్యూమర్ కలిస్తే అది ఖచ్చితంగా ఒక క్రేజీ ఎంటర్‌టైనర్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం హీరోయిన్ సెలక్షన్. మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా ఫిక్స్ చేశారు.

నిజానికి సితార బ్యానర్‌కి మీనాక్షి అంటే ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ బ్యానర్‌లో ఇది ఆమెకు ఏకంగా ఐదవ సినిమా. వరుసగా ఒకే నిర్మాణ సంస్థలో ఇన్ని అవకాశాలు రావడం అంటే అది మామూలు విషయం కాదు. ‘గుంటూరు కారం’లో మహేష్ బాబు సరసన చిన్న రోల్ చేసినా, ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’లో తన నటనతో అందరినీ మెప్పించింది.

వీటితో పాటు నవీన్ పోలిశెట్టి సినిమా, వెంకీ అట్లూరి వెబ్ సిరీస్ ఇలా వరుసగా ఆమెకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక వైపు అరవ హీరోలతో పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూనే, మరోవైపు తెలుగు ఆడియన్స్‌కు బాగా అలవాటైన మీనాక్షి చౌదరిని రిపీట్ చేయడం వెనుక సితార ఒక పక్కా కమర్షియల్ స్ట్రాటజీని అనుసరిస్తోంది. మీనాక్షికి ఉన్న క్రేజ్ ఆ సినిమాలకు అదనపు బలాన్ని ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.

వరుసగా ఐదు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారంటే ఆమెను ఒక లక్కీ హీరోయిన్ అని సితారా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ కూడా ఇస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నాగవంశీ టీమ్ వేస్తున్న ఈ ప్లాన్స్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించేలా ఉన్నాయి. తమిళ హీరోల మార్కెట్‌ను ఉపయోగించుకుంటూనే మన నేటివిటీని మిక్స్ చేస్తూ తీస్తున్న ఈ సినిమాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News