మాస్ జాతర ట్రైలర్ టాక్: మాస్ రాజా ఈసారి 'క్రిమినల్ పోలీస్'
భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. ట్రైలర్ ఎండింగ్‌లో రవితేజ చెప్పే డైలాగ్ సినిమా మూడ్‌ను సెట్ చేసింది.;
పోలీస్ క్యారెక్టర్ తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ రేటును పెంచుకున్న మాస్ రాజా రవితేజ ఈసారి మళ్ళీ అదే ఫార్ములతో రాబోతున్నాడు. రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర' ప్రమోషన్ తోనే పాజిటివ్ హైప్ క్రియేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ట్రైలర్ ద్వారా సినిమాపై అసలు క్లారిటీ ఇచ్చేశారు. ట్రైలర్ చూస్తే, ఇది రొటీన్ పోలీస్ స్టోరీ కాదనిపిస్తోంది. ట్రైలర్ మొదట్లోనే ఏదో పెద్ద స్మగ్లింగ్ రాకెట్ గుట్టు విప్పే సీన్లతో, కథ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందని హింట్ ఇచ్చారు.
అడవులు, పాత రైల్వే స్టేషన్లు, గూడ్స్ ట్రైన్లు.. విజువల్స్ అన్నీ చాలా రా అండ్ రస్టిక్‌గా, ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఈ చీకటి సామ్రాజ్యంలోకి ఎంట్రీ ఇచ్చే మహారాజా, ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విలన్స్ ను ఊచకోత కొస్తాడాని అర్ధమవుతుంది. అలాగే "నేను రైల్వే పోలీస్ కాదు.. క్రిమినల్ పోలీస్".. అనే ఈ ఒక్క డైలాగ్‌తో క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో చెప్పేశారు.
చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, క్రిమినల్స్‌ను వాళ్ల స్టైల్‌లోనే డీల్ చేసే ఒక డేంజరస్ పోలీస్ ఆఫీసర్‌ను చూడబోతున్నామని అర్ధమవుతుంది. "ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక నీ దందా నడిచింది.. ఇకనుంచి సత్యనాష్" అని విలన్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్ చూస్తేనే ఆ ఇంటెన్సిటీ అర్థమవుతుంది. అయితే, రవితేజ అంటే కేవలం యాక్షన్ కాదుగా.. ఫన్ ఉండాల్సిందే. ఆ డోస్ కూడా ట్రైలర్‌లో గట్టిగానే చూపించారు.
ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్‌తో కామెడీ ట్రాక్ బాగా వర్కవుట్ అయినట్లుంది. "మీరు ఒక్కరేనా? బ్రదర్స్ ఉన్నారా?" అంటే "అన్నయ్య ఉన్నాడు సార్", "అతని పేరు భానుప్రియ?" అనే పంచ్ అదిరింది. హీరోయిన్ శ్రీలీలతో లవ్ ట్రాక్, పాటలు కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక విలన్ గా నవీన్ చంద్ర క్యారెక్టర్ కూడా పవర్ఫుల్ గా ఉండనున్నట్లు అర్థమవుతుంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టే 'జాతర' కీలక పాత్ర పోషిస్తోంది. మేజర్ యాక్షన్ బ్లాక్స్ అన్నీ ఆ జాతర బ్యాక్‌డ్రాప్‌లోనే చాలా వైల్డ్‌గా, కలర్‌ఫుల్‌గా ప్లాన్ చేసినట్లున్నారు.
భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. ట్రైలర్ ఎండింగ్‌లో రవితేజ చెప్పే డైలాగ్ సినిమా మూడ్‌ను సెట్ చేసింది. "రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్‌లుంటాయ్.. నేను వచ్చినాక ఒకటే జోన్.. వార్ జోన్" అనే డైలాగ్ మాస్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉంది. ఇక మొత్తం మీద, 'మాస్ జాతర' ట్రైలర్ రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ఒక కొత్త రకమైన యాక్షన్, ఇంటెన్స్ డ్రామాను ప్రామిస్ చేస్తోంది. డైరెక్టర్ భాను భోగవరపు ఒక పక్కా మాస్ మీల్స్ రెడీ చేసినట్లున్నాడని అర్ధమవుతుంది. ఇక అక్టోబర్ 31 విడుదల కాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.