అరటి పండ్లు అమ్మేవాడిని 400కోట్ల మూవీ తీస్తున్నా!
టాలీవుడ్ లో మారుతి సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ కాకముందు డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా పనిచేసాడు.;
టాలీవుడ్ లో మారుతి సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ కాకముందు డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా పనిచేసాడు. అదే సమయంలో తనలో స్కిల్స్ ను డెవలప్ చేసుకోవడంతో డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. తొలి ప్రయత్నంగా `ఈరోజుల్లో` అనే సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. అటుపై `బస్ స్టాప్` తో మరో హిట్ ఖాతాలో పడింది. అనంతరం స్టార్ హీరోలకు ప్రమోట్ అయ్యాడు. అక్కడ నుంచి మారుతికి తిరుగు లేదు.
నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు? అంటే అతడి సక్సెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. తాజాగా మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ పెస్టివల్ లో తన గతాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. `1999లో హైదరాబాద్ కి వచ్చాను. అంతకు ముందు వైజాగ్ లో అరటి పండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపంట్ల బండి ఉండేది.
ఓవైపు నేను పని చేసుకుంటూ సినిమాలు చూసేవాడిని. 99 లో హైదరాబాద్ లో స్టిక్కరింగ్ షాప్ పెట్టాను. కాలేజీలో చదువుకుంటూ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే? కష్టపడితే ఏదైనా సాధిం చొచ్చు అన్నది నా సిద్దాంతం. అందుకు నేనే ఉదాహరణ. ఒకప్పుడు అరటి పండ్లు అమ్మే నేను ప్రభాస్ తో 400 కోట్ల సినిమా తీస్తున్నా. రాజాసాబ్ మీరు ఊహించిన దానికంటే ఒక శాతం ఎక్కువగానే ఉంటుంది.
జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం` అన్నాడు. మారుతికి అవకాశాలు రావడంలో మెగా క్యాంప్ కీలక పాత్ర పోషించింది. అతడి ప్రతిభను మెగా క్యాంప్ గుర్తించింది. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ప్రయాణం మొదలు పెట్టి సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా మారుతితో సినిమా చేస్తానని ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.