12th ఫెయిల్ మూవీ వెనుక‌.. IPS మనోజ్‌కు IGగా పదోన్నతి

మనోజ్ కుమార్ శర్మ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజీ) పదవి నుంచి మహారాష్ట్ర పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) స్థాయికి పదోన్నతి పొందారు.

Update: 2024-04-24 11:02 GMT

నిజ‌జీవితంలో హీరోగా మారిన ఒక యువ‌కుని జీవిత‌క‌థ స్ఫూర్తితో రూపొందించిన '12th ఫెయిల్' సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ సినిమా వేడుక‌ల్లోను ఈ చిత్రం అవార్డులు రివార్డులు అందుకుంటోంది. ఈ చిత్రానికి విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించగా విక్రాంత్ మాస్సే క‌థానాయ‌కుడిగా న‌టించారు. భారతీయ పోలీస్ సర్వీస్ అధికారిగా మారడానికి శ్ర‌మించిన ఒక పేద విద్యార్థి అయిన మనోజ్ కుమార్ శర్మ గురించి అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

IPS మనోజ్ కుమార్ శర్మ 12వ తరగతిలో విఫలమయ్యాడు. చివరికి IPS అధికారి కావాలనే తన కలను ఛేజ్ చేసి విజ‌యం సాధించాడు. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన అచంచలమైన పట్టుదల సంకల్పంతో UPSCని ఛేదించాడు.

తాజా స‌మాచారం మేర‌కు.. 12వ త‌ర‌గతి ఫెయిల్ సినిమాకి స్ఫూర్తిగా నిలిచిన ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారి మనోజ్ కుమార్ శర్మ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజీ) పదవి నుంచి మహారాష్ట్ర పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) స్థాయికి పదోన్నతి పొందారు. ప్రమోషన్ తర్వాత, IPS IG మనోజ్ శర్మ X లో ఈ వార్తను షేర్ చేసారు. ASP నుండి ప్రారంభమైన ప్రయాణం భారత ప్రభుత్వ ఆదేశంతో ఈరోజు IG గా ప్ర‌మోట‌య్యాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.. అని రాసారు.

Read more!

12th ఫెయిల్ ర‌జ‌తోత్స‌వం: విక్రాంత్ మాస్సే - మేధా శంకర్ నటించిన విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ గత అక్టోబర్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లై వాణిజ్యపరంగా అలాగే విమర్శనాత్మకంగా విజయవంతమైంది. థియేట‌ర్ల‌లో 25 వారాలు పూర్తి చేసుకుని కీల‌క‌ మైలురాయిని అధిగ‌మించింది. చాలా కాలం తర్వాత హిందీ సినిమాకి ఇదే తొలి రజతోత్సవం.

దర్శకుడు విధు వినోద్ చోప్రా తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ఈ మూవీలో టైటిల్ రోల్ కోసం విక్రాంత్‌ని ఎంపిక చేయడం వెన‌క కార‌ణం రాజు హిరాణీ అని వెల్ల‌డించారు. రాజు హిరాణీ పంపించిన ఈ పుస్త‌కాన్ని చదివి తాను సినిమా తీసానని కూడా విదు వినోద్ తెలిపారు.

Tags:    

Similar News