సాయి పల్లవిని మణి సర్ ఎలా చూపించబోతున్నారో?
మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్‌స్టోరీతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.;
మణిరత్నం..భారతీయ దర్శకుల్లో ఓ లెజెండ్. తనదైన పంథాలో సినిమాలని తెరకెక్కించడంలో అయిన శైలి ప్రత్యేకం. ప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. రోజా నుంచి `ఓకే బంగారం` వరకు ఈ విషయాన్ని నిరూపించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్‌స్టోరీతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.
అయితే సినీ లవర్స్, మణిరత్నం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని తాజాగా అఫీషియల్‌గా ప్రకటించారు. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీని కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మంగా తెరపైకి తీసుకురాబోతోంది. మద్రాస్ టాకీస్ సహ భాగస్వామిగా వ్యహరిస్తోంది. ఈ బ్యానర్ కిది 23వ సినిమా. విలక్షణ నటనకు పెట్టింది పేరు విజయ్ సేతుపతి. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. మణిరత్నంతో ఆయనకిది రెండవ సినిమా. ఇంతకు ముందు `చెక్క చివంత వానం`లో నటించారు.
దీన్నే తెలుగులో `నవాబ్` పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. `రామాయణ`తో పాటు పలు భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవికి మణిరత్నంతో ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజులుగా రెహమాన్ స్థానంలో యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఆ పుకార్లకు చెక్ పెడుతూ టీమ్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ చేస్తారంటూ క్లారిటీ ఇచ్చేసింది.
మణిరత్నం మార్కు రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి ప్రారంభిం అయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నటించే కీలక నటీనటులు, సాంకేతిక నిపుణుల వివారాల్ని టీమ్ త్వరలోనే వెల్లడించనుంది. సాయి పల్లవి లాంటి నటితో ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్న మణిరత్నం తనని ఎలా ప్రజెంట్ చేస్తాడు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
గత సినిమాల్లో హీరో క్యారెక్టర్‌తో పాటు హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యతనిచ్చే మణిరత్నం ఈ రొమాంటిక్ డ్రామాలో నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవిని ఎలా ప్రజెంట్ చేస్తాడు?..తన క్యారెక్టర్‌ని ఎలా డిజైన్ చేయబోతున్నాడు? అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ ఉన్న సాయి పల్లవి ..మణిరత్నం ప్రాజెక్ట్‌కు డేట్స్ కేయించిందంటే సర్‌ప్రైజింగ్ ఎలామెంట్ ఏదో ఉంటుందని కూడా అందరూ చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి డిటైల్స్‌ని లైకా ప్రొడక్షన్స్ వర్గాలు వెల్లడించే అవకాశం ఉంది.