ప్రదీప్ తర్వాత అతన్ని పట్టుకున్న మైత్రి మేకర్స్..!

ప్రస్తుతం మణికందన్ తమిళ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇక వాటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ తో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడట.;

Update: 2025-11-20 06:05 GMT

సినిమాల్లో ఛాన్స్ రావడమే లక్ అని ఫీల్ అయ్యే వాళ్లు కొందరైతే ఆ అవకాశాన్ని తమ కెరీర్ ని టర్న్ తిప్పేలా చేసుకోవడంలో మరికొందరు ఉంటారు. అలాంటి కొందరిలో తప్పకుండా టాలెంటెడ్ యాక్టర్ మణికందన్ ఉంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చిన మణికందన్ ఇప్పుడు లీడ్ హీరోగా వరుస ఛాన్స్ లు అందుకుంటున్నాడు. గుడ్ నైట్ అనే సినిమాతో మణికందన్ ఓటీటీలో సూపర్ ఎంటర్టైనర్ గా నిలిచాడు. ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మరిన్ని ఛాన్స్ లు అందుకుంటున్నాడు.




 


స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు..

ఓ పక్క స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తూనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో మంచి పాపులారిటీ సంపాదిస్తున్నాడు మణికందన్. ఐతే ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్ మీద మైత్రి మూవీ మేకర్స్ కన్ను పడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కూడా మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. హిందీ లో రాత్ నిర్మించి సక్సెస్ అందుకోగా తమిళ్ లో అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేసి హిట్ కొట్టారు.

రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ సినిమా చేసి ఆ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు మైత్రి మేకర్స్. ప్రదీప్ తర్వాత మరో టాలెంటెడ్ యాక్టర్ మణికందన్ తో మైత్రి మేకర్స్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగాయని టాక్. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. మణికందన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు కాబట్టి స్క్రిప్ట్ విషయంలో కూడా తన ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తాడు. సినిమా బెటర్ గా రావడానికి తన ఎఫర్ట్స్ పెడతాడు మణికందన్.

మణికందన్ తమిళ్ లో వరుస ప్రాజెక్ట్ లు..

ప్రస్తుతం మణికందన్ తమిళ్ లో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇక వాటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ తో నెక్స్ట్ సినిమా లాక్ చేసుకున్నాడట. ఐతే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు.. ఎలాంటి కథతో ఈ కాంబినేషన్ సినిమా వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. రీసెంట్ గానే ప్రదీప్ రంగనాథన్ తో ఎలా ఐతే డ్యూడ్ తో హిట్ అందుకున్నారో అదే ప్లాన్ తో మణికందన్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు మైత్రి మేకర్స్. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

తమిళ్ లో తన టాలెంట్ తో సినిమాలు, సీరీస్ లు ఇలా ఎలాంటి అవకాశాన్ని వదలకుండా మణికందన్ చేస్తూ వచ్చాడు. ఐతే టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ మణికందన్ తో సినిమా చేయడం నిజంగానే అతను లక్కీ అని చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News