మ‌ణిర‌త్నంతో మ‌రోసారి శింబు?

అయితే శింబు ఇప్పుడు మారిన మ‌నిషిగా క‌నిపిస్తున్నాడు. అత‌డు చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మ‌ణిర‌త్నం- క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి థ‌గ్ లైఫ్ కోసం ప‌ని చేసాడు.;

Update: 2025-05-30 17:30 GMT

కోలీవుడ్ లో ర‌జ‌నీకాంత్, త‌ళా అజిత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో ఏలాల్సిన హీరో శింబు. కానీ అతడి క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం, వివాదాస్ప‌ద వైఖ‌రిపై ద‌ర్శ‌క‌నిర్మాత‌ల నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర‌య్యాయి. కొన్ని వ‌రుస ఫ్లాపులు కెరీర్ కి పెద్ద మైన‌స్ అయ్యాయి. దాదాపు ఇండ‌స్ట్రీ త‌న‌ను నిషేధించిన ద‌శ‌లో ద‌ర్శ‌క దిగ్గ‌జం మ‌ణిర‌త్నం త‌న‌ను ఆదుకున్నార‌ని శింబు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించాడు.

అయితే శింబు ఇప్పుడు మారిన మ‌నిషిగా క‌నిపిస్తున్నాడు. అత‌డు చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మ‌ణిర‌త్నం- క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి థ‌గ్ లైఫ్ కోసం ప‌ని చేసాడు. ఇప్పుడు మారిన మ‌నిషితో మ‌ళ్లీ ప‌ని చేసేందుకు మ‌ణిర‌త్నం కూడా రెడీ అవుతున్నార‌ని, ఈసారి శింబుతో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కిస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ సినిమాలో ఏస్ (సేతుప‌తి హీరో) ఫేం రుక్మిణి వ‌సంత్ క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఉంది. 'థ‌గ్ లైఫ్' రిలీజ్ త‌ర్వాత దీనిపై ప్ర‌క‌ట‌న వెలువ‌డేందుకు ఆస్కారం ఉంది.

అయితే ఈ సినిమా కంటే ముందు, శింబు త‌న‌ కెరీర్ 49వ సినిమాలో న‌టించాల్సి ఉంది. దీనికి రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వ‌హిస్తారు. #STR49 చిత్రీక‌ర‌ణ కోసం అత‌డు వేచి చూస్తున్నారు. అయితే ఈ సినిమాని నిర్మిస్తున్న డాన్ పిక్చర్స్‌కు చెందిన ఆకాష్ బాస్కరన్ పై ఈడీ దాడుల‌తో ప్ర‌స్తుతానికి ప్రాజెక్ట్ వెయిటింగ్ మోడ్ లో ఉంద‌ని తెలుస్తోంది. నిర్మాత ఇబ్బందుల దృష్ట్యా ఆలోచిస్తే, శింబుతో మ‌ణిర‌త్నం ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే ఛాన్సుందేమో చూడాలి. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Tags:    

Similar News