ఆ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు:రచ్చ రవి
తాజాగా మంగ్లీ బర్త్‌డే పార్టీపై కమెడియన్ రచ్చ రవి వివరణ ఇచ్చాడు. రీసెంట్‌గా జరిగిన మంగ్లీ బర్త్‌డేకు తనకు సంబంధం ఉందని నాపై ప్రచారం జరుగుతోందని నా నోటీసుకు వచ్చింది.;
సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ వివాదాస్పదంగా మారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పార్టీలో పాల్గొన్న కొంత మంది తమకు ఎలాంటి పాపం తెలియదని, ఆ పార్టీలో పాల్గొన్నామే అక్కడ జరిగిన దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ ఫేమ్ దివి మంగళవారం జరిగిన బర్త్‌డే పార్టీలో పాల్గొన్నానని, అయితే అక్కడ జరిగిన తప్పులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దయచేసి ఈ వివాదంలోకి తనని లాగొద్దని మీడియాని రిక్వెస్ట్ చేస్తూ ఓ ఆడియోని మీడియాకు విడుదల చేసింది.
తాజాగా మనో నటుడు రచ్చ రవి కూడా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ పార్టీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా పాల్గొన్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక్కొక్కరుగా వివరణ ఇస్తూ వస్తున్నారు. తాజాగా మంగ్లీ బర్త్‌డే పార్టీపై కమెడియన్ రచ్చ రవి వివరణ ఇచ్చాడు. రీసెంట్‌గా జరిగిన మంగ్లీ బర్త్‌డేకు తనకు సంబంధం ఉందని నాపై ప్రచారం జరుగుతోందని నా నోటీసుకు వచ్చింది.
అందుకే మీడియా మిత్రులకు సవినయంగా తెలియజేస్తూ మీడియా ప్రకటన చేస్తున్నాను. మంగ్లీ బర్త్‌డే ఈవెంట్‌లో నేను పాల్గొన్నానని ప్రచారం జరుగుతోంది. దానిపై అందరికి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆ పార్టీలో పాల్గొనలేదు. భాగం కాలేదు. గత కొన్ని రోజులుగా వరుస షూటింగ్ షెడ్యూల్స్‌తో ఉండి నా ఫ్యామిలీకే టైమ్ కేటాయించలేకపోతున్నాను. అలాంటి పరిస్థితిలో ఉన్న నేను మంగ్లీ బర్త్‌డే పార్టీలో నేను పాల్గొన్నానని, నా పేరు వివిధ ఛానెళ్లలో, మీడియా పబ్లికేషన్స్‌లో రావడం చూసి ఆశ్చర్యపోయాను.
ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన మీడియా వర్గాలని దయచేసి నేను కోరేది ఒక్కటే ఈ లాంటి వాటిల్లో నా పేరుని జోడించే ముందు ఒక్కసారి నిజానిజాలేంటో క్రాస్ చెక్ చేసుకుని మంచిది. మంగ్లీ బర్త్‌డే పార్టీలో నేను భాగం కాలేదని మరొక్కసారి క్లారిటీ ఇస్తున్నాను` అన్నారు కమెడియన్ రచ్చ రవి.