మంగ్లీ కొత్త సాంగ్.. ఎక్కడ చూసినా అదే వైబ్..

సింగర్ మంగ్లీ సాంగ్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏ తో పాపులర్ అయిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.;

Update: 2025-11-15 06:43 GMT

సింగర్ మంగ్లీ సాంగ్స్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏ తో పాపులర్ అయిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తనదైన వాయిస్ తో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న మంగ్లీ.. తెలంగాణకు పల్లె పాటలు, ఫోక్ గీతాలు పాడటంలో ఎక్స్పర్ట్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ పాడని పాట లేదని చెప్పాలి. ఆమె గాత్రానికి శ్రోతలు ఫిదా కావాల్సిందే. పక్కా ఫోక్ సాంగ్ అయినా.. సినిమా పాటలు అయిన తన వాయిస్ తో మెస్మరైజ్ చేయడం గ్యారెంటీ ఇప్పటివరకు అనేక చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ను మంగ్లీ తనదైన శైలిలో ఆలపించిన విషయం తెలిసిందే.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రైవేట్ సాంగ్స్ తో సందడి చేసే మంగ్లీ.. ఇప్పుడు మరో ఫోక్ సాంగ్ తో సందడి చేయనుంది. బాయిలోనే బల్లి పలికే అంటూ సాగనున్న పాటను మరో సింగర్ నాగవ్వతో కలిసి మంగ్లీ ఆలపించారు. అందుకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. మరికొద్ది రోజుల్లో ఫుల్ సాంగ్ విడుదల కానుంది.

ఆ సాంగ్ గ్లింప్స్ ఇప్పుడు మామూలు రెస్పాన్స్ సొంతం చేసుకోవడం లేదని చెప్పాలి. ఇప్పటి వరకు యూట్యూబ్ లో 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న గ్లింప్స్.. ఎక్కడ చూసినా సందడి చేస్తూనే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే అనేక మంది ఆ గ్లింప్స్ కు రీల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.

మొత్తానికి బాయిలోనే బల్లి పల్లికే పాట దూసుకుపోతోంది. ముఖ్యంగా సింగర్ మంగ్లీ పాట పాడితే ఆ హుషారు ఎలా ఉంటుందో తెలుసుగా.. ఫోక్‌ సాంగ్స్ లో హంగామా తెలసుగా.. ఇప్పుడు కూడా సాంగ్ విషయంలో అదే రిపీట్ అయింది. దానికి తోడు మంగ్లీ అదిరిపోయే స్టెప్పులు వేయడంతో.. మరింత ఆకట్టుకునే విధంగా మారింది.

ఏదేమైనా ఫుల్ సాంగ్ వచ్చాక మాత్రం ఏ డీజేలో అయినా అదే ప్లే అవ్వడం పక్కా అనే చెప్పాలి. కమల్ ఇస్లావత్ రాసిన ఆ పాటను సురేష్ బొబ్బిలి హుషారెత్తించే ట్యూన్ తో కంపోజ్ చేశారు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ బాధ్యతలు తీసుకోగా.. దాము రెడ్డి కోస్నం దర్శకుడిగా వ్యవహరించారు. మరి బాయిలోనే బల్లి పలికే కంప్లీట్ సాంగ్ ఎప్పుడు వస్తుందో.. ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News