కన్నప్ప.. ట్రోలర్స్ కు విష్ణు స్ట్రాంగ్ ఆన్సర్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.;

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. మంచి టాక్ తో దూసుకుపోతోంది. శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కన్నప్ప.. సూపర్ రెస్పాన్స్ తో ఆడియన్స్ ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా విష్ణు యాక్టింగ్ కోసం నెటిజన్లు, సినీ ప్రియులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. తన నటనతో మంచు హీరో అదరగొట్టేశారని చెబుతున్నారు. ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశారని కామెంట్లు పెడుతున్నారు. సినిమా కోసం ఎంత కష్టపడ్డారో స్క్రీన్ పై క్లియర్ గా తెలుస్తోంది అంటున్నారు. కొన్ని సీన్స్ లో విష్ణు కంటతడి పెట్టేంచేశారని చెబుతున్నారు.
సినిమా అంతా ఒకెత్తైతే.. క్లైమాక్స్ మరో స్థాయిలో ఉందని, అప్పుడు విష్ణు తన నట విశ్వరూపం చూపించారని కొనియాడుతున్నారు. క్లైమాక్స్లో ఎవరూ ఊహించని విధంగా విష్ణు యాక్ట్ చేశారని చెబుతున్నారు. స్క్రీన్ పై కనిపించే తీరు, భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయని అంటున్నారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు విష్ణు.
ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా విష్ణును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెబుతున్నారు. నెవ్వర్ బిఫోర్ యాక్టింగ్ అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విష్ణు ఇమేజ్ ను కన్నప్ప మూవీ పెంచేసిందని చెబుతున్నారు. అంచనాలకు మించి మూవీ ఉందని కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఇదివరకు నటించిన పాత్రలపై విష్ణు ట్రోలింగ్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కన్నప్ప మూవీతో సీన్ మారిపోయిందని చెప్పాలి. తన యాక్టింగ్ తో ట్రోలర్స్ కు గట్టి సమాధానం ఇచ్చారు విష్ణు. తనపై వచ్చిన విమర్శలకు కన్నప్ప సినిమాలోని అద్భుతమైన నటనతో గట్టి సమాధానం ఇచ్చారని చెెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
కాగా, కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన కన్నప్ప మూవీలో విష్ణు లీడ్ రోల్ పోషించారు. కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తించారు. సినిమా విషయంలో అన్నీ తానై ముందుకు నడిపించారు. షూటింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు దగ్గరుండి చూసుకున్నారు. మూవీని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసి సందడి చేశారు. ఇప్పుడు కన్నప్పతో మంచి హిట్ అందుకుని సత్తా చాటారు.