మంచు విష్ణు నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

కన్నప్ప తో మంచు విష్ణు నటుడిగా ఒక మెట్టు ఎక్కాడు అనడంలో తప్పేమి లేదు. కన్నప్ప సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు విష్ణు చాలా ఫోకస్ తో ఆ సినిమా చేశాడు.;

Update: 2025-06-29 19:08 GMT
మంచు విష్ణు నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

కన్నప్ప తో మంచు విష్ణు నటుడిగా ఒక మెట్టు ఎక్కాడు అనడంలో తప్పేమి లేదు. కన్నప్ప సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు విష్ణు చాలా ఫోకస్ తో ఆ సినిమా చేశాడు. సినిమా మీద తనకున్న నమ్మకాన్ని.. సినిమా కోసం అతను పడిన కష్టాన్ని చాలామంది ఎగతాళి చేసినా సరే శివుడి మీద బాధ్యత వేసి తన ప్రయత్న లోపం లేకుండా కష్టపడ్డాడు మంచు విష్ణు. అందుకే ఆయన కష్టానికి తగిన ఫలితం వచ్చింది. సినిమాకు ఈ బజ్ రావడానికి ప్రభాస్ కారణమైన కన్నప్ప సినిమా ప్రేక్షకులకు చేరవేయడంలో అది కూడా శివుడు ఆడించిన లీల అని చెప్పాలి.

కన్నప్ప కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా మంచు విష్ణు యాక్టింగ్ టాలెంట్ ప్రూవ్ అయ్యింది. ఐతే కన్నప్ప క్రేజ్ ని మంచు విష్ణు నెక్స్ట్ సినిమాలకు ఎలా వాడుకుంటాడు అన్నది చూడాలి. మంచి కథ దాన్ని చెప్పినట్టుగా తీసే దర్శకుడు ఇలా మంచి కాంబినేషన్ లో సినిమాలు చేస్తే తప్పకుండా మంచు విష్ణుకి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది.

మంచు విష్ణు ఇదివరకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఐతే కన్నప్ప తర్వాత నుంచి తన ఆలోచనా విధానం మారే అవకాశం ఉంది. తప్పకుండా కాస్త ఫోకస్ చేస్తే మంచు విష్ణుకి మంచి కథలు పడే ఛాన్స్ ఉంటుంది. అలా మరో హిట్టు సినిమా పడితే మంచు ఫ్యామిలీ నట ప్రస్థానాన్ని విష్ణు కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.

మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్ చూసిన ఆడియన్స్ అతని ప్రయత్న లోపం లేదని మెచ్చుకుంటున్నారు. సో ఆడియన్స్ లో కన్నప్పతో ఒక పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న మంచు విష్ణు ఇక మీదట స్క్రిప్టుల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే మాత్రం మంచి సినిమాలు పడే ఛాన్స్ ఉంటుంది. మరి కన్నప్ప వల్ల ఆడియన్స్ లో విష్ణు పట్ల ఏర్పడ్డ ఈ సాఫ్ట్ కార్నర్ నెక్స్ట్ సినిమాలకు ఎలా మార్చుకుంటాడన్నది చూడాలి. మంచు విష్ణు కన్నప్ప తర్వాత చేసే ప్రాజెక్ట్ ల విషయంలో అప్పుడే కథల వేటలో పడ్డాడని తెలుస్తుంది.

Tags:    

Similar News