మనోజ్.. ఎంత మంచోడంటే..
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. డైలాగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.;
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. డైలాగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విలక్షణమైన పాత్రలు, వైవిధ్యమైన నటనతో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. అనేక హిట్స్ కూడా అందుకున్నారు.
బాల నటుడిగా మేజర్ చంద్రకాంత్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన మనోజ్.. ఆ తర్వాత దొంగ దొంగది మూవీతో హీరోగా మారారు. అక్కడి నుంచి రిజల్ట్ తో సంబంధం లేకుండా వివిధ చిత్రాల్లో నటించారు. కానీ పర్సనల్ రీజన్స్ వల్ల ఇటీవల కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు రీసెంట్ గా రీఎంట్రీ ఇచ్చారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవంలో గణపతి వర్మగా నటించి మెప్పించిన మనోజ్.. ఇప్పుడు మిరాయ్ తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాలో విలన్ గా నటించిన ఆయన.. తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. విలనిజానికి తాను పెర్ఫెక్ట్ అని అందరూ అనేలా చేశారు. ఇప్పుడు వాట్ ది ఫిష్ లో యాక్ట్ చేస్తున్నారు.
మరిన్ని సినిమాల్లో నటించేందుకు చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో మంచు మనోజ్ మంచితనం గురించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వివిధ సందర్భాల్లో పంచుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ బాబీ కొల్లి కూడా షేర్ చేసుకోగా.. ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మనోజ్ చాలా రెస్పెక్ట్ ఇస్తారని, ఆయన ఎక్కడుంటే అక్కడ పండుగ వాతావారణం నెలకొంటుందని చెప్పారు. తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆయననేని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. "2011లో నేను మ్యారేజ్ చేసుకున్నా.. ఎవరికీ తెలియదు.. సెటిల్ అవ్వకుండా కొత్తగా పెళ్లి చూసుకుంటే చాలా టెన్షన్లు ఉంటాయి. ఆ సమయంలో పెళ్లి అయిన వారం తర్వాత వైఫ్ తో కార్ లో హైదరాబాద్ వస్తున్నా. అప్పుడే మనోజ్ అన్న కాల్ చేశారు" అని తెలిపారు.
"నీవు ఎలాంటి ఒత్తిడి తీసుకోకు.. వెంటనే డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తా అని తెలిపారు. ప్రమోషన్ ఇస్తా అని కూడా చెప్పారు. రైటర్ గా నీవెంటో నాకు తెలుసు.. డైరెక్టర్ గా చేద్దువురా తమ్ముడు అని చెప్పారు. మనోజ్ అన్న 2011లో ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నేను సిద్ధంగా లేను కాబట్టి రెండేళ్ల తర్వాత రవితేజ గారి సినిమాతో డైరెక్టర్ అయ్యాను. అది మనోజ్ అన్న అంటే" అని బాబీ చెప్పారు.
"2005లో వచ్చిన పొలిటికల్ రౌడీ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా. అప్పుడే దశరథ్ దర్శకత్వంలో శ్రీ అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే సెట్స్ లో మనోజ్ అన్న చుట్టూ పది మంది స్నేహితులు ఉంటారు. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడి.. సరదాలు, భోజనాలు ఉంటాయి. అందరినీ ఈక్వెల్ గా చూసుకుంటారు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కేర్ తీసుకున్నారు. అదే రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు అదే ఇస్తున్నారు" అంటూ కొనియాడారు. దీంతో నెటిజన్లు, అభిమానులు.. ఇది కదా మనోజ్ మంచితనం అని అంటున్నారు.