మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి'.. ఫస్ట్ పోస్టర్ తో హైప్ ఎక్కేలా!
అయితే రీసెంట్ గా భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు మనోజ్. ఆ సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించారు.;
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. తన లాంగ్ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కొన్ని హిట్స్ తో పాటు మరికొన్ని ఫ్లాప్స్ ను అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. సోలో సినిమాను అనౌన్స్ చేశారు.
అయితే రీసెంట్ గా భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు మనోజ్. ఆ సినిమాలో తన యాక్టింగ్ తో మెప్పించారు. తన డైలాగ్ డెలివరీ, హావభావాలతో మెప్పించారు. ఇప్పుడు మిరాయ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాలో విలన్ గా కనిపించనున్నారు.
ఇప్పుడు పవర్ ఫుల్ ప్రాజెక్ట్ డేవిడ్ రెడ్డితో మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డైనమిక్ పోస్టర్ తో నేడు సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. 1897 నుంచి 1922 వరకు సాగిన కాలం నాటి ఇతిహాసం, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలతో ఉత్కంఠభరితమైన కథతో సినిమా రూపొందుతోంది.
హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మూవీలో మనోజ్ మంచు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారు. బ్రిటిష్ పాలనను సవాలు చేయడానికి కుల అణచివేత నుంచి లేచిన ధైర్యవంతుడైన తిరుగుబాటు దారుడిగా కనిపించనున్నారు.
"TFI లో రాకింగ్ స్టార్ మనోజ్ 21 సంవత్సరాల జర్నీని బ్యాంగ్ తో జరుపుకుంటున్నారు. ఈసారి, ఒక నిర్భయ తిరుగుబాటు దారుడిగా వస్తున్నారు. #MM21 టైటిల్ డేవిడ్ రెడ్డి. 1897 - 1922 నేపథ్యంలో సాగే ఒక తీవ్రమైన చారిత్రక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. ది హనుమ రెడ్డి యక్కంటి విజన్" అని మేకర్స్ తెలిపారు.
అదే సమయంలో రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. ఒక్కసారిగా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. టైటిల్ పోస్టర్ పై ఉన్న స్టేట్మెంట్ పాజిటివ్ బజ్ నెలకొల్పింది. టైటిల్ ఫోంట్ లో మనోజ్ ఫేస్ కనిపిస్తుంది. "మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు" అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. మరి సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.