సింపుల్ స్టెప్స్ తో స్టేజ్ పై అదరగొట్టేసిన మమిత బైజు.. వీడియో వైరల్!

ప్రతి ఏడాది ఇండస్ట్రీకి ఎవరో ఒకరు కొత్త సెలబ్రిటీ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది తమ నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంటే.. మరి కొంతమంది ఫెయిలవుతూ ఉంటారు;

Update: 2025-10-14 09:52 GMT

ప్రతి ఏడాది ఇండస్ట్రీకి ఎవరో ఒకరు కొత్త సెలబ్రిటీ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంతమంది తమ నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంటే.. మరి కొంతమంది ఫెయిలవుతూ ఉంటారు. అయితే అలా ఫేమస్ అయిన వారిలో ఇప్పుడు మనం చెప్పుకోపోయే హీరోయిన్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా చేయకముందు దాదాపు 8,9 సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలన్నింటికి రాని గుర్తింపు ఈ ఒక్క సినిమా తెచ్చి పెట్టింది. అదే ప్రేమలు మూవీ.. గత ఏడాది మలయాళంలో వచ్చిన ప్రేమలు మూవీని తెలుగులో కూడా రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. అలా ఈ మూవీ టాలీవుడ్ లో ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుంది. అలా ప్రేమలు సినిమాతో ఇందులో నటించిన హీరోయిన్ మమిత బైజుకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో మమిత బైజు యాక్టింగ్ కి ఫిదా అయినా చాలామంది దర్శక నిర్మాతలు ఆమెకు తమ సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చారు.అలా కోలీవుడ్ లో సూర్య, విజయ్, ధనుష్ వంటి దిగ్గజ హీరోలతో పాటు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది.

అలాంటి ఈ బ్యూటీ ప్రదీప్ రంగనాథన్ తో కలిసి నటించిన డ్యూడ్ మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పై మమిత బైజు చేసిన డ్యాన్స్ కి చాలామంది ఫిదా అవుతున్నారు. స్టేజ్ మీద సాంగ్ రావడంతోనే మమిత బైజు స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం మమితా బైజు చేసిన ఈ డ్యాన్స్ కి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో యాక్టింగ్ తోనే కాదు డాన్స్ తో కూడా ఇరగదీసింది అంటూ ఆమె డాన్స్ కు సంబంధించి చాలా మంది జనాలు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మమిత బైజు చీర కట్టులో ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు దోచుకుంది. అలా చీరలో మమితా బైజు డాన్స్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఉండిపోయారని చెప్పవచ్చు.

మమిత బైజు నటించిన డ్యూడ్ మూవీ విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా తెరకెక్కిన డ్యూడ్ మూవీ అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన డ్యూడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.అందుకే ఈ సినిమాని తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.

మమిత బైజు డ్యూడ్ మూవీ తో పాటు తమిళ హీరో సూర్య హీరోగా నటిస్తున్న సూర్య 46 మూవీ, విజయ్ తలపతితో జననాయగన్ మూవీలో కూడా నటిస్తోంది. అలాగే ధనుష్ D 54 మూవీలో హీరోయిన్ గా మమిత బైజు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు విష్ణు విశాల్ తో ఇరందు వానం మూవీలో నటిస్తుంది. ఇలా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మమిత బైజుకి ఈ సినిమాలన్నీ హిట్ అయితే గనుక తెలుగులో కూడా ఆమెకు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Tags:    

Similar News