ఛుమ్మా ఇస్తావా అనడిగాడు.. మాళవికకు పోలీసుల రిప్లై!
ముంబై మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదా? అంటే.. కాదు అని అంటోంది మాళవిక మోహనన్.;
ముంబై మహిళలకు సురక్షితమైన ప్రదేశం కాదా? అంటే.. కాదు అని అంటోంది మాళవిక మోహనన్. రాజా సాబ్ నటి తాజా ప్రకటన వీడియో ఒకటి అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రకారం.. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో, మాళవిక తన ఇద్దరు మహిళా స్నేహితురాళ్ళతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు, ఒక వ్యక్తి వారి కిటికీ దగ్గరకు వచ్చి ``ఏక్ చుమ్మా దేగి క్యా?`` (నాకు ముద్దు ఇస్తావా?) అని అనుచిత వ్యాఖ్య చేశాడు. ఆ క్షణం మేం స్తంభించిపోయాము... మేము కేవలం ముగ్గురు యువతులం.. పూర్తిగా ఏమీ చేయలేని దుర్బల స్థితిలో ఉన్నామని చెప్పింది.
ముంబై మహిళలకు సురక్షితమని ప్రజలు చెబుతుంటారు. కానీ నేను ఆ ఆలోచన సరికాదని చెప్పాలనుకుంటున్నాను... అని మాళవిక వ్యాఖ్యానించింది. మాళవిక వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు స్పందించిన ముంబై పోలీసులు వెంటనే సోషల్ మీడియాలో ఒక నోట్ రాసారు. ఈ నోట్ సారాంశం ఇలా ఉంది.
మీరు ముంబైలో ఆందోళనకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారని విన్నాం. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరమైనవి.. దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని మేము ఊహించగలము. అందువల్ల నగరంలో రోజులో ఏ సమయంలో అయినా..ఏ ప్రదేశంలో ఉన్నా దయచేసి 112/100 నంబర్‌లో మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా మద్దతు అందిస్తాము. చెప్పకపోతే నేరస్థుడిని ధైర్యాన్నిస్తుంది. ముంబై నగరం ఎల్లప్పుడూ మహిళలకు సురక్షితంగా ఉంటుంది. దానిని మెరుగుపరచడానికి ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టము. ఒకసారి చెప్పాక నేరస్థుడిని తగిన విధంగా చట్టబద్ధంగా శిక్షిస్తాము. దయచేసి మీ మంచి పేరును ఉపయోగించి ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయండి. ఇది అటువంటి సమస్యలను పరిష్కరించడంలో బాగా సహాయపడుతుంది`` అని స్పందించారు.