హిందీ సినిమాలు.. రాజాసాబ్ పాప రివర్స్ కౌంటర్
హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి అందరికీ తెలిసిందే. మాలీవుడ్ కు చెందిన ఆమె.. ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.;
హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి అందరికీ తెలిసిందే. మాలీవుడ్ కు చెందిన ఆమె.. ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. శాండల్ వుడ్, బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న ఆ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొనగా, మాళవిక లుక్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పుడు షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. అదే సమయంలో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేసింది మాళవిక.
బియాండ్ ది క్లౌడ్స్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె.. గత ఏడాది యుధ్రా సినిమాలో నటించారు. కానీ అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయిన మాళవిక.. ఇప్పుడు మరో సినిమా చేయనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో యాక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది.
అయితే హిందీ చిత్రాల విషయంపై తన అభిప్రాయం వ్యక్తపరిచింది. "నేను ఒక విషయం మీద చాలా క్లారిటీతో ఉంటా. ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళంలో అద్భుతమైన సినిమాలు చేస్తున్నాను. కానీ హిందీ చిత్రాలు కేవలం పేరు కోసం చేయడం నాకు ఇష్టం లేదు" అంటూ చెప్పుకొచ్చింది మాళవిక.
"వాటి నుంచి నాకు ఎటువంటి ఉత్సాహం ఉండదు. చాలా సినిమాల తర్వాత, మీరు ఒక దశకు చేరుకుంటారు. అప్పుడే మీరు ఇలా ఆలోచిస్తారు.. ఈ సినిమాకు నేను ఐదు నెలలు నా జీవితం ఇవ్వాలా?" అని అనుకున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఫోకస్ క్లియర్ గా తెలుస్తుందని అంటున్నారు.
అందుకే ప్రాజెక్టుల విషయంలో సరైన విధంగా ఆలోచించి, భిన్నమైన సినిమాల ద్వారా మాళవిక మెప్పిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. ఆమె చేసే ప్రతి రోల్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెబుతున్నారు. ప్రతి సినిమా కోసం చాలా హర్డ్ వర్క్ చేస్తున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు. మరి ఫ్యూచర్ లో మాళవిక.. బాలీవుడ్ సినిమాల్లో నటిస్తారో లేదో వేచి చూడాలి.