వ్య‌భిచారం చేయ‌క‌పోయినా చేశాన‌ని చెప్పిన న‌టి!

ఆ న‌టి ఎవ‌రు? అంటే.. 70ల‌లో ఒక వెలుగు వెలిగిన ప్ర‌ముఖ క‌థానాయిక మాలా సిన్హా.;

Update: 2025-09-15 02:51 GMT

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. దానిని స్వేచ్ఛ‌గా న‌చ్చిన‌ట్టు నడిపించ‌గ‌ల‌మ‌ని చాలా మంది భావిస్తారు. కానీ జీవిత‌మే ఎప్పుడూ మ‌న‌ల్ని న‌డిపిస్తుంది. త‌న దారికి తెచ్చుకుంటుంది. లైఫ్‌ అనే `బిగ్ బాస్` ఆట‌ను ఆడ‌టంలో త‌డ‌బ‌డితే ఫ‌లితం కూడా అంతే దారుణంగా ఉంటుంది.

అలాంటి ఆటలో ఈ న‌టి నిజంగా ఓడిపోయింది. ఒకే ఒక్క అబ‌ద్ధం ఈ న‌టి జీవితాన్ని త‌ల‌కిందులు చేసింది. అది కూడా కోర్టు గ‌దిలో ఆడిన అబ‌ద్ధం త‌న కెరీర్ ని స‌ర్వ‌నాశ‌నం చేసింది. తిరిగి ఎప్ప‌టికీ కోలుకోలేని అప్ర‌తిష్ఠ పాల్జేసింది. అది కూడా డ‌బ్బు కోసం ఆశ‌ప‌డి, త‌న తండ్రి చేసిన త‌ప్పును తాను కాచేందుకు ఆ అబ‌ద్ధం చెప్పాల్సి వ‌చ్చింది. డ‌బ్బు కోస‌మే అన్నిటినీ వ‌దులుకుని ఆ అబ‌ద్ధం ఆడింది. చివ‌రికి విధివంచిత‌గా మారింది``

ఆ న‌టి ఎవ‌రు? అంటే.. 70ల‌లో ఒక వెలుగు వెలిగిన ప్ర‌ముఖ క‌థానాయిక మాలా సిన్హా. క్లాసిక్ డే స్టార్లు ధర్మేంద్ర, శశి కపూర్, మనోజ్ కుమార్, గురుద‌త్ వంటి ప్ర‌ముఖ హీరోల స‌ర‌స‌న న‌టించిన మేటి క‌థానాయిక‌గా వెలిగిపోయింది. య‌ష్ చోప్రా తొలి చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టించి పేరు తెచ్చుకున్నారు.

త‌నవైన‌ అంద‌మైన క‌ళ్లు అద్బుథ హావ‌భావాల‌తో మంత్రం వేసే ఈ న‌టి అనూహ్యంగా ఆదాయ‌ప‌న్ను శాఖ చేసిన దాడిలో బుక్క‌యింది. న‌ల్ల డ‌బ్బు దాచి పెట్టింది! అనే ఆరోప‌ణ‌ల కార‌ణంగా డైల‌మాలో ప‌డిపోయింది. త‌న‌ ఇంటిపై దాడి చేసి తండ్రి దాచిపెట్టిన రూ.12 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును తిరిగి పొందాలనే ఆశతో వారు కోర్టుకు వెళ్లారు. కానీ డ‌బ్బు తిరిగి రావాలంటే ఆ డ‌బ్బు సినిమాల ద్వారా కాకుండా `ఇత‌ర వ‌న‌రుల‌` ద్వారా వ‌చ్చింద‌ని కోర్టు గ‌దిలో అంగీక‌రించ‌మ‌ని న్యాయ‌వాదులు స‌ల‌హా ఇచ్చారు. ఆ త‌ప్పుడు స‌ల‌హా విని త‌న‌కు ఇష్టం లేక‌పోయినా చివ‌ర‌కు న్యాయ‌వాదులు ఆడించిన‌ట్టు ఆడారు. అది కేవ‌లం డ‌బ్బు కోసం ఆడిన ఆట‌.. కానీ చేయ‌ని త‌ప్పును చేసాన‌ని అంగీక‌రించాన‌ని ఆ న‌టి ఆ త‌ర్వాతి రోజుల్లో ప‌శ్చాత్తాపం చెందారు. నా డ‌బ్బు తిరిగి వ‌చ్చింది కానీ మాయ‌ని మ‌చ్చ పడిపోయింద‌ని ఆమె అంగీక‌రించింది. 1978లో ఘ‌ట‌న ఇది. కానీ త‌న కీర్తి ప్ర‌తిష్ఠ‌లు శాశ్వ‌తంగా మంట‌క‌లిసాయి. కెరీర్ మొత్తం నాశ‌న‌మైంది.

Tags:    

Similar News