ఆ బ్రాండ్ కి మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ పెయిడ్!
బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్ దూకుడు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.;
బ్రాండ్ అంబాసిడర్ గా సూపర్ స్టార్ మహేష్ దూకుడు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రఖ్యాత బ్రాండ్ లన్నీ మహేష్ చేతిలోనే ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఎండార్స్ మెంట్స్ కోసమంటూ టైమ్ కేటాయిస్తుంటారు. మధ్య మధ్యలో షూటింగ్ బ్రేక్ టైమ్ లోనూ వాటిని పూర్తి చేస్తుంటారు. అలా రెండు చేతులా సంపాదన అనేది మహేష్ చాలా కాలం క్రితమే క్రియేట్ చేసుకున్నారు. మహేష్ కోసం కార్పోరేట్ కంపెనీలెన్నో క్యూ లో ఉంటాయి. ఆయన ఒకే చెబితే డబ్బు పని లేకుండా అగ్రిమెంట్ చేసుకుంటారు.
తాజాగా మహేష్ ఖాతాలో మరో యాడ్ లో నటించడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ షాపింగ్ బ్రాండ్ మహేష్ ని తమ అంబాసిడర్ గా నియమించుకున్నట్లు సమాచారం. ఈ డీల్ కి మహేష్ పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తున్నారుట.బ్రాండింగ్స్ లోనే రాజసదరు కంపెనీ మహేష్ కి హయ్యస్ట్ పెయిడ్ చేస్తుందని సమాచారం. ఇద్దరి మధ్య లాంగ్ రన్ ఉండేలా అగ్రిమెంట్ జరుగుతుందట. ఇప్పటివరకూ మహేష్ ఎక్కువ కాలం ఓ పర్ ప్యూమ్ కంపెనీతోనే ఇలాంటి డీల్ కుదుర్చుకున్నారని..ఆ తర్వాత తమదే రెండవ స్థానంలో ఉంటుందని సదరు కంపెనీ భావిస్తుందిట.
ఈ విషయాలు అధికారికంగా రివీల్ చేస్తే గానీ క్లారిటీ రాదు. ఇక మహేష్ ప్రస్తుతం `గుంటూరు కారంలో` నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని నెలలు పాటు ఆ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉంటారు. అది పూర్తయిన వెంటనే ఎస్ ఎస్ ఎంబీ 29 ప్రారంభమవతుంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది అన్న అంచనాలు న్నాయి.
గుంటూరు కారం తర్వాత మహేష పూర్తిగా రాజమౌళి సినిమాకే బాండ్ అవుతారు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. చిత్రీకరణ కోసమే సంవత్సరాలు పట్టేఅవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ లైనప్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడే అంచనా వేయలేం. ఆ తర్వాత ఆయన నిర్ణయాల మరింత కేరింగ్ గా ఉంటాయి. ఈ విషయంలో మహేష్ చాలా విషయాల పరిగణలోకి తీసుకుని కొత్త ప్రాజెక్ట్ కమిట్ అవుతుంటారు.