మ‌హేష్ నే క‌న్న‌డిగులు ఎందుకు టార్గెట్ చేసిన‌ట్లు?

పెట్టుబ‌డులు పెట్టాల‌ని ప్ర‌తీ రాష్ట్రం కోరుకుంటుంది. ఏటా ప్ర‌భుత్వాలు దేశ‌-విదేశాల్లో ఉన్న కంపెనీల‌తో ఎంఓయూలు కుదుర్చుకుంటాయి.;

Update: 2023-09-16 09:50 GMT

పెట్టుబ‌డులు పెట్టాల‌ని ప్ర‌తీ రాష్ట్రం కోరుకుంటుంది. ఏటా ప్ర‌భుత్వాలు దేశ‌-విదేశాల్లో ఉన్న కంపెనీల‌తో ఎంఓయూలు కుదుర్చుకుంటాయి. మెట్రో సిటీలు..స్మార్ట్ సిటీలు వంటివి వృద్దిలోకి వ‌స్తున్నాయంటే కార‌ణం పెట్టుబ‌డులే. నేడు బెంగుళూరు మ‌హాన‌గ‌రంగా..సిలికాన్ సిటీగా మారిందంటే? కార‌ణం దేశంలో అన్ని ప్రాంతాల వారు పెట్టుబ‌డులు పెట్ట‌డంతోనే సాధ్య‌మైంది. కేవ‌లం క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌జ‌లు.. ప్ర‌భుత్వా లు తోనే వృద్దిలోకి రాలేదు.

మ‌హాన‌గ‌రంలో ఎంతో మంది బిజినెస్ టైకూన్ల పెట్టుబ‌డుల‌తోనే అది సాధ్య‌మైంది. ఇప్పుడా విష‌యాన్ని క‌న్న‌డిగులు విస్మ‌రించిన‌ట్లు తాజా స‌న్నివేశం చూస్తుంటే క‌నిపిస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బిజినెస్ ని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. మా రాజ‌ధానిలోకి వ‌చ్చి మీరు పెట్టుబ‌డి పెట్ట‌డం ఏంటి? మేము ఉండ‌గా? అన్న కొత్త నిబంధ‌న తెస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఏషియ‌న్ భాగ‌స్వామ్యంలో మ‌హేష్ ఏడు తెర‌ల మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. కేజీ రోడ్డులో ఉన్న క‌పాలి థియేట‌ర్ స్థానంలో నిర్మాణం జ‌రుగుతుంది.

ప్ర‌స్తుతం ప‌నులు జ‌రుగుతున్నాయి. ఎలాగైనా వ‌చ్చే ఏడాదిక‌ల్లా పూర్తి చేసి లాంచ్ చేయాల‌న్న‌ది ప్లాన్. దీనిలో భాగంగా కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. అయితే క‌న్న‌డిగులు దీనిపై విష‌యం చిమ్ముతున్నారు. మా ల్యాండ్ పై మీ పెట్టుబ‌డులు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్స‌హిస్తే ఇలాంటి వాళ్లు ఇంకా చాలా మంది బెంగుళూరులో వ్యాపారాలు చేస్తార‌ని అసూయ ప‌డుతున్నారు. వాస్త‌వానికి క‌పాలి థియేట‌ర్ అమ్మ‌కానికి పెట్టారు. దాన్ని విక్ర‌యించి ఆ స్థానంలో మ‌హ‌ష్ అండ్ కో నిర్మాణం చేప‌డుతుంది.

దీంతో క‌న్న‌డిగులు త‌మ అక్క‌సును..అసూయ‌ని ఆ ర‌కంగా వెళ్ల‌గ‌క్కుతున్నారు. బెంగుళూరు లో ఇప్ప‌టికే చాలా మ‌ల్టీప్లెక్స్ లు..స్టార్ హోట‌ల్స్ ఉన్నాయి. ఇవ‌న్నీ ముంబై కేంద్రంగా న‌డుస్తోన్న కార్పోరేట్ గ్రూప్ సంస్థ‌లు. మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ కూడా అదే కోవ‌కు చెందుతుంది. మ‌రి కొత్త‌గా క‌న్న‌డిగులు స్థానిక‌త అంశాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో రాజ‌కీయ కోణం ఏదైనా ఉందా? అన్న‌ది మ‌రో సందేహం. ఇప్ప‌టికే గ‌చ్చిబౌలిలో మ‌హేష్ ఏషియ‌న్ సంస్థ‌తో క‌లిసి ఏఎంబీ మాల్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News