దసరాకి పోస్టర్ ప్లానింగ్..?

SSMB29 సినిమా మొదలై ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.;

Update: 2025-08-20 06:01 GMT

SSMB29 సినిమా మొదలై ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. సినిమా మొదలైందన్న విషయం తెలిసినా సరే రాజమౌళి అనుకున్నప్పుడు మాత్రమే సినిమా అప్డేట్స్ వస్తాయి కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ బర్త్ డే రోజు కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఐతే ఫ్యాన్స్ బాధను అర్ధం చేసుకున్న జక్కన్న నవంబర్ లో SSMB 29 సినిమా అప్డేట్ వస్తుందని చెప్పారు. ఐతే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ పక్కా అని హామీ ఇచ్చాడు.

నవంబర్ దాకా వెయిటింగ్..

ఐతే నవంబర్ దాకా ఫ్యాన్స్ ని వెయిట్ చేయించాలని రాజమౌళి అనుకున్నా కూడా దసరాకి ఒక పోస్టర్ అయినా వదలాలనే ప్లాన్ లో ఉన్నారట. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యాక కూడా ఇంకా పోస్టర్ కూడా వదలకపోతే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి సినిమా విషయంలో అప్డేట్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా ఆయన ప్లానింగ్ ప్రకారమే ఉంటాయి. ఏదో ఒక పోస్టర్ వదులుదాం అనే ఆలోచన ఆయనకు ఉండదు.

అందుకే రాజమౌళి మహేష్ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా నవంబర్ లోనే టీజర్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి దసరా పండగకి ఒక పోస్టర్ ని వదలాలని అనుకుంటున్నారట. దీనికి సంబందిచిన న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో డిస్కషన్ జరుగుతుంది. రాజమౌళి మహేష్ కాంబోలో గ్లోబల్ త్రొట్టెన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది.

SSMB29 స్పెషల్ ట్రీట్..

సినిమాలో మహేష్ కు జతగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నాడు. అకాడమీ విన్నర్ ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నారట. తప్పకుండా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కి ఈ సినిమా ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెబుతున్నారు. 2027 లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్ నారాయణ SSMB29 సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

RRRతో కేవలం ఒక సాంగ్ కి మాత్రమే ఆస్కార్ వచ్చింది. ఐతే మహేష్ సినిమాతో సినిమాతో పాటుగా బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇలా అన్ని విభాగాల్లో ఆస్కార్ టార్గెట్ పెట్టాడు రాజమౌళి. మరి రాజమౌళి అనుకున్నట్టుగా అది సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News