మ‌హేష్‌..బ‌న్నీ ఒకేసారి? ఇది ప్ర‌ళ‌య‌మే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకేసారి బాక్సాఫీస్ బ‌రిలోకి దిగ‌బోతున్నారా? ఇద్ద‌రు సై అంటే సై అన‌డానికి రెడీ అవుతున్నారా? అంటే ఇప్పుడిదే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.;

Update: 2025-09-03 02:30 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకేసారి బాక్సాఫీస్ బ‌రిలోకి దిగ‌బోతున్నారా? ఇద్ద‌రు సై అంటే సై అన‌డానికి రెడీ అవుతున్నారా? అంటే ఇప్పుడిదే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లుగా ఇద్ద‌రి హీరోల చిత్రాలు తెర‌కెక్కుతున్నాయ‌న్న‌ది వాస్త‌వం. ఎస్ ఎస్ ఎంబీ 29ని ద‌ర్శ‌క శిఖ‌రం రాజ‌మౌళి గ్లోబ‌ల్ రేంజ్ లో ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే కొంత భాగంగా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ విదేశాల్లో జ‌రుగుతోంది. అక్క‌డ నుంచి పీసీ ఇస్తోన్న అప్ డేట్స్ చూస్తుంటే ఫ్యాన్స్ లో పూన‌కాలు మామూలుగా లేవు.

భారీ బ‌డ్జెట్ చిత్రాలు:

ఎన్నో ఎగ్జోటిక్ లోకేష‌న్స్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ పై అంచ‌నాలు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి. మ‌హేష్ ని రాజ‌మౌళి ఎలా చూపించ‌బోతున్నారు? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ రెట్టింపు అవుతుంది. మ‌రోవైపు అట్లీ కూడా బ‌న్నీ 22వ చిత్రాన్ని అంతే ప్ర‌తిష్ట‌త్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ కెరీర్ లోనే తొలి భారీ బ‌డ్జెట్ చిత్రంగా స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఇందులో బ‌న్నీ మూడు నాలుగు పాత్ర‌లు పోషిస్తున్నాడు? అన్న ప్ర‌చార‌మే సినిమా ను ప‌తాక స్థాయిలో నిల‌బెడుతుంది.

ఇండియాని షేక్ చేసేలా:

హీరోయిన్ గా దీపికా ప‌దుకొణే లాంటి టాప్ క్లాస్ భామ‌ల్ని రంగంలోకి దించారు. ఇంట‌ర్నేష‌నల్ స్టూడియో స్ లో బ‌న్నీ లుక్ టెస్ట్ నిర్వ‌హించ‌డం స‌హా వివిధ అంశాలు సినిమాకు గ్లోబ‌ల్ అప్పీరియ‌న్స్ తీసుకొ చ్చాయి. ఇలా మ‌హేష్‌-బ‌న్నీ సినిమా అంటే ఇప్పుడు ఇండియాలో కాదు విదేశాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఇండియా షేక్ అయ్యే వార్త వెలుగులోకి వ‌స్తోంది. ఈ రెండు చిత్రాల‌ను 2027 లో ఒకేసారి రిలీజ్ చేయాలి? అన్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నా లొస్తున్నాయి.

ఇద్ద‌రు ఒకేసారి వ‌స్తే ప్ర‌ళ‌య‌మే:

అదీ స‌మ్మ‌ర్ టార్గెట్ రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు వినిపిస్తోంది. మ‌హేష్ సినిమా 2027లో రిలీజ్ అవుతుంది అన్న‌ది ముందే ఫిక్స్ అయిన విష‌యం. మ‌హేష్ కూడా సూచ‌న ప్రాయంగా అంగీక‌రించారు. బ‌న్నీ సినిమా కూడా 2026 చివ‌రి నుంచి 2027 ఆరంభం మ‌ధ్య‌లో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని వినిపించింది. కానీ ఇప్పుడీ ఈ రెండు చిత్రాలు 2027 స‌మ్మ‌ర్ కు రిలీజ్ అన్న‌ది హాట్ టాపిక్ గా మారుతోంది.

Tags:    

Similar News