వార‌ణాసి సినిమా ప్లాట్ ఇదేనా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ -రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న `వార‌ణాసి`పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-04-08 17:30 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ -రాజ‌మౌళి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న `వార‌ణాసి`పై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే 120 దేశాల అంత‌ర్జాతీయ రిలీజ్ అనే మాట‌తో సంచ‌ల‌న‌మైంది. నిరంత‌రం ఈ సినిమా గురించి నెట్టింట ఏదో వార్త ప్ర‌చారంలోకి వ‌స్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా ప్లాట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్ర కథాంశం ఆధ్యాత్మిక నగరం `వారణాసి` నేపథ్యంలో ప్రారంభమవుతుందని అక్కడే కథలోని కీలక మలుపులు దాగి ఉన్నాయని సమాచారం. ఈ ప్రచారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే? కథానాయకుడి పాత్రకు ఎదురయ్యే ద్రోహం.

రాజమౌళి గత చిత్రాలైన `బాహుబలి`లో కట్టప్ప వెన్నుపోటు, `ఛత్రపతి`లో సొంత తమ్ముడి మోసం వంటి ఎమోషన్స్ ఎంతలా పండాయో తెలిసిందే. తాజాగా వార‌ణాసి సినిమాలో కూడా ఆయనకు అత్యంత సన్నిహితులైన వారి నుంచే తీవ్రమైన వెన్నుపోటు ఎదురవుతుందని, ఆ ద్రోహం చుట్టూనే సినిమాలోని ప్రధాన సంఘర్షణ సాగుతుందని టాక్ వినిపిస్తోంది. కేవలం వారణాసికే పరిమితం కాకుండా? ఈ కథ అక్కడి నుండి అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్‌గా మారుతుందని తెలుస్తుంది.

ఆఫ్రికన్ అడవుల్లో సాగే సాహసయాత్రకు, వారణాసిలో జరిగే ఈ ద్రోహానికి మధ్య రాజమౌళి ఎలాంటి లింక్ పెట్టారో అన్నది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది. సన్నిహితుల నుంచి ఎదురయ్యే మోసం వల్ల కథానాయకుడు తన లక్ష్యం కోసం ఏ స్థాయికి వెళ్తాడు అనేది సినిమాలోని మెయిన్ థీమ్ అని అంటున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుముమారన్ కీలక పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆయన పాత్ర మహేష్ కు మిత్రుడిగా ఉంటూనే శత్రువుగా మారుతుందా? లేక ఆ వెన్నుపోటు వెనుక అసలు మాస్టర్ మైండ్ ఆయనేనా? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.

రాజమౌళి తన సినిమాల్లో విలన్ పాత్రలను కూడా హీరోకి సమానంగా శక్తివంతంగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ద్రోహం అనే ఎలిమెంట్ సినిమాలో ప్ర‌ధానంగా హైలైట్ కానుంది. ద్రోహానికి గురైన ఒక సామాన్యుడు సాహసిగా ఎలా మారాడు? తనను మోసం చేసిన వారిపై ఎలా విజయం సాధించాడు? అనే అంశాలను రాజమౌళి తనదైన శైలిలో వెండి తెరపై ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. ఇదంతా నెట్టింట జ‌రిగే ప్ర‌చారం మాత్ర‌మే. ఇందులో ఏది నిజం? ఏది అబద్దం? అన్న‌ది మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

రాజమౌళి గత చిత్రాల సరళిని పరిశీలిస్తే? ఆయన కేవలం ప్రతీకారం చుట్టూనే కాకుండా ఆ ప్రయాణంలో నాయ కుడు పొందే పరిణితిని కూడా అద్భుతంగా చూపిస్తారు. ఈ ద్రోహం వార్తలు నిజమైతే తనను నమ్మించి మోసం చేసిన వారు ఎవరు? ఆ ద్రోహం వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రలేమిటి? అనే కోణంలో కథనం అత్యంత ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. మహేష్ లాంటి ఇంటెన్స్ నటుడు, రాజమౌళి విజన్‌కు తోడైతే వెండితెరపై ఆ ఎమోషనల్ డ్రామా విశ్వరూపం దాల్చడం ఖాయం. లీకైన సమాచారం అంతా ఒక ఊహాగానం మాత్రమే అయిన ప్పటికీ ఇది సినిమాపై ఉన్న భారీ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుంది.

Tags:    

Similar News