మహేష్ SSMB29 కోసం 550 మంది
అయితే ఈ మూవీ కోసం త్వరలో ఓ భారీ సాంగ్‌ని షూట్ చేయబోతున్నారట. ఇందు కోసం ఏ1 స్టూడియోస్‌లో సాంగ్ సీక్వెన్స్ కోసం భారీ సెట్‌ని ఏర్పాటు చేస్తున్నాట.;
జక్కన్నతో కలిసి సూపర్‌స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో మూవీకి ఎక్కువ రోజులు తీసుకుంటూ చెక్కే జక్కన్న ఈ మూవీని మాత్రం రాకెట్ స్పీడుతో లాగించేస్తున్నారు. ఒడిశాలో ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసి షాక్ ఇచ్చిన రాజమౌళి ఆ వెంటనే రెండవ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసి మూడవ షెడ్యూల్‌కు రెడీ అయిపోయారు. ఇంత వేగంగా SSMB29 షూటింగ్‌ని జక్కన్న పరుగులు పెట్టిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇండియానా జోన్స్ తరహాలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా హాలీవుడ్ స్థాయి సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో తెరపైకి వస్తున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీలో మహేష్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పాత్రలో జేమ్స్‌బాండ్ తరహా క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓసారి తను విలన్‌గా కనిపిస్తారని, లేదు లేదు కీలక పాత్ర అని వార్తలు షికారు చేస్తున్నాయి. తాజా వార్తల నేపథ్యంలో ఈ మూవీలో ఆఫ్రికన్ నటుడు ఇందులో విలన్‌గా నటించే అవకాశాలు వున్నాయని, సినిమా నేపథ్యం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన నటుడు అయితేనే క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుందని టీమ్ భావిస్తోందట.
ఈ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న జక్కన్న త్వరలోనే ఆ విషయాన్ని రివీల్ చేసే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే జక్కన్న తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా శరవేగంతో షూటింగ్ చేస్తున్న ఈ మూవీ మూడవ షెడ్యూల్‌ని కూడా రాకెట్ స్పీడుతో మొదలు పెట్టాలనుకుంటున్నారట. హైదరాబాద్‌లో దీనికోసం ఓ భారీ సెట్‌ని కూడా రెడీ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ మూవీ కోసం త్వరలో ఓ భారీ సాంగ్‌ని షూట్ చేయబోతున్నారట. ఇందు కోసం ఏ1 స్టూడియోస్‌లో సాంగ్ సీక్వెన్స్ కోసం భారీ సెట్‌ని ఏర్పాటు చేస్తున్నాట. అంతే కాకుండా ఈ మాసీవ్ సెట్ కోసం 550 మంది వర్క్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన బ్లాస్టింగ్ న్యూస్ బయటికి రానున్నట్టుగా తెలిసింది. సెట్టు కోసమే 550 మంది వర్క్ చేస్తున్నారంటే సినిమాలో ఈ పాట హైలైట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.