వెయ్యి కోట్ల తరువాత మహేష్ మైత్రి.. సెట్టయ్యేనా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళితో వర్క్ చేయాలనే కోరిక ప్రతీ హీరోకు ఉంటుంది. సైడ్ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.;
తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళితో వర్క్ చేయాలనే కోరిక ప్రతీ హీరోకు ఉంటుంది. సైడ్ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇక వన్స్ ఛాన్స్ దొరికితే అంతకుమించి అనేలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ప్రస్తుతం మహేష్ బాబు అదే ట్రావెల్ లో ఉన్నాడు. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఇక దీని తరువాత మహేష్ ఎవరితో చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ ఇప్పటి నుంచే వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం అయితే పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB29 కోసం మహేష్ పూర్తిగా డెడికేట్ అయిపోయారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయినట్టు, ఇప్పుడు రాజమౌళితో కలిసి చేసే ఈ భారీ ప్రాజెక్ట్ తరువాత మహేష్ బాబుకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ రావడం ఖాయం అని ఇండస్ట్రీలో టాక్. మరో హాట్ టాపిక్ ఏంటంటే.. మహేష్ బాబు రాజమౌళి సినిమా తరువాత తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తారు అనేది.
ఇప్పటికే టాప్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ మహేష్‌ను సంప్రదించినట్టు సమాచారం. మహేష్ నెక్ట్స్ మూవీ కోసం భారీ అడ్వాన్స్ ఇవ్వడానికి మైత్రి సిద్ధంగా ఉందట. ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి మైత్రి వారు ముందుగానే సైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహేష్ మాత్రం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పట్లో ఏ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇవ్వకూడదనే స్టాండ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా మహేష్ బాబుతో తర్వాత సినిమా చేయడానికి మైత్రి వాళ్లు టాప్ డైరెక్టర్ల కోసం హంట్ మొదలుపెట్టారు.
ప్రత్యేకంగా తమిళ దర్శకులు లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి వారితో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మహేష్ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రేజీ డైరెక్టర్‌ను రీచ్ కావాలనే టార్గెట్‌తో మైత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ బిజినెస్‌ను ఇప్పుడు ఇతర భాషల్లో విస్తరించాలనే లక్ష్యంతో, మహేష్‌తో కలిసి మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మైత్రి మూవీ మేకర్స్ వారి తొలి ప్రయత్నం మహేష్ బాబు ‘శ్రీమంతుడు’తోనే మొదలైంది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది.
అయితే ఇప్పుడు SSMB29 బడ్జెట్ 1000 కోట్లు. ఇక నెక్స్ట్ సినిమా ఎవరితో చేసినా అంతకుమించి లేదా దానికి సమానంగా ఉండాలి. ఇక సినిమా రిజల్ట్ గ్లోబల్ లెవెల్ మరింత హై రేంజ్ లో ఉంటే మహేష్ మార్కెట్ స్థాయిని ఊహించడం కష్టమే. మహేష్ రేంజ్ ఇండియన్ స్టార్లను మించి పోతుందా అనే ఆసక్తి కూడా ఉంది. అందుకే మైత్రి వారు ఎలాంటి డైరెక్టర్‌తో సినిమా చేసినా, మహేష్ ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడనే నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ అయితే పూర్తిగా రాజమౌళి సినిమా పనుల్లోనే మునిగిపోయారు. వేరే ఆలోచనలు లేకుండా సింగిల్ ఫోకస్‌తో ముందుకెళ్తున్నారు. రాజమౌళి సినిమా తర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించే అవకాశముందంటున్నారు. మైత్రి వారు మాత్రం ముందుగానే ప్లానింగ్ స్టార్ట్ చేసి, డైరెక్టర్ ఆప్షన్లు చూశాకే నెక్ట్స్ స్టెప్ వేయాలనుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్ సెట్టవుతుందా లేదా అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.