• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gossips >  మహేష్ తో మరోసారి కబడ్డీ...

మహేష్ తో మరోసారి కబడ్డీ పట్టు

| టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని తెరమీద చూసి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా సర్కారు వారి పాట సినిమాతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. దీంతో, మహేష్ తదుపరి చిత్రం గుంటూరు కారం పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-15 06:28 GMT


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ని తెరమీద చూసి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా సర్కారు వారి పాట సినిమాతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. దీంతో, మహేష్ తదుపరి చిత్రం గుంటూరు కారం పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.

ఈ మూవీ కూడా షూటింగ్ నేపథ్యంలో ఆలస్యమౌతూ వస్తోంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది కి వాయిదా పడిపోయింది. అయితే, మూవీ ఆలస్యమైనా ఈ సినిమాలో ఫ్యాన్స్ ని సంతోషపెట్టే ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి అని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో త్రివిక్రమ్ మార్క్ కబడ్డీ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

మహేష్ గతంలో ఒక్కడు సినిమాలో కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమాకి కబడ్డీ సీన్స్ చాలా హైలెట్ అని చెప్పాలి. ఆ మూవీకి గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. మరి ఈ సారి త్రివిక్రమ్ కూడా గుంటూరు కారం కోసం మహేష్ తో కబడ్డీ ఆడించాలని డిసైడ్ అయ్యాడట. మరి ఈ ఆటను త్రివిక్రమ్ ఎలా ఆడిస్తాడో చూడాలి. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి.

కాగా, తొలి షెడ్యూల్ లోనే ఈ కబడ్డీ సీన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంకా, ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉందట. వాటి కోసం హైదరాబాద్ లోని పలు ప్రదేశాలను వెతుకుతున్నట్లు సమాచారం. మంచి లొకేషన్ దొరకగానే, యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. ఇది పూర్తయితే, మూవీ దాదాపు పూర్తయినట్లే అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల నటిస్తోంది. నిజానికి మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల మొత్తం మారిపోయింది. పూజ ప్లేస్ లోకి శ్రీలల వచ్చేసింది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.

Tags:    
  • MaheshBabu 
  • Gunturkaram 
  • Trivikram 
  • SSMB29 
  • Tollywood 
  • TupakiNews 
  • Telugu News. 
  • LatestNews 

Similar News

డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్‌.. హీరో ఏం చేస్తాడు?

2026-10-08 06:55 GMT

అభిమానులు కూడా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నారా?

2026-07-08 03:30 GMT

స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

2025-12-17 03:56 GMT

అతి ఆలోచ‌న చేతులు కాల్చుకునేలా!

2025-09-21 21:30 GMT

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

2025-06-11 22:30 GMT

ఆఫీస్ కోసం 25ల‌క్ష‌ల అద్దె చెల్లిస్తున్న సూప‌ర్‌స్టార్

2025-02-20 13:16 GMT

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

2024-10-26 03:15 GMT

అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

2024-08-12 06:16 GMT

అమ‌రావ‌తిలో క‌ల్కి ఈవెంట్‌పై ఈ ప్ర‌చారం నిజ‌మా?

2024-06-18 04:12 GMT

అంజ‌లిపై ఇంట్లో వాళ్ల‌కు అంత న‌మ్మ‌క‌మా!

2024-05-27 06:30 GMT

విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హార్థిక్ సోద‌రుడు!

2024-05-26 04:01 GMT

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

2024-04-18 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS