సినిమాలు యాడ్లు వదలడు.. ఫ్యామిలీని విడిచిపెట్టడు!
ఓవైపు మహేష్ వరుసగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. మరోవైపు రాజమౌళితో కీలక సినిమా షెడ్యూళ్లను పూర్తి చేస్తున్నాడు.;
ఓవైపు మహేష్ వరుసగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. మరోవైపు రాజమౌళితో కీలక సినిమా షెడ్యూళ్లను పూర్తి చేస్తున్నాడు. ఇంతలోనే అతడు విదేశాలకు కుటుంబంతో షార్ట్ ట్రిప్ లు వెళుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏమాత్రం తీరిక సమయం చిక్కినా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లడం మహేష్ కి హ్యాబిట్ గా మారింది.
ఈ అలవాటు ప్రకారం అతడు ప్రస్తుతం యూరోపియన్ దేశాలైన ఇటలీ, టస్కనీలో వెకేషన్ కి వెళ్లాడు. మహేష్ తో పాటు నమ్రత, సితార ఘట్టమనేని కూడా ఈ టూర్ లో ఉన్నారు. ఇంతకుముందు ఈ ట్రిప్ కి బయలుదేరే ముందు విమానాశ్రయంలో తన పాస్‌పోర్ట్‌ను కూడా చూపించాడు. ఇప్పుడు ఆన్ సైట్ నుంచి ఫోటోగ్రాఫ్స్ ని ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు. రోమ్ విజిట్ తర్వాత మహేష్ కుటుంబం టస్కనీకి వెళ్లింది. అక్కడి నుంచి లైవ్ ఫోటోలు ఎగ్జయిట్ చేస్తున్నాయి.
ఇక ఈ వెకేషన్ కి వెళ్లే ముందు రాజమౌళి తో ఎస్.ఎస్.ఎం.బి 29 కి సంబంధించి రెండు ప్రధాన షెడ్యూళ్లను పూర్తి చేసిన మహేష్ తదుపరి ఏప్రిల్ చివరి నుంచి మూడో షెడ్యూల్ ని ప్రారంభిస్తాడని సమాచారం. ఓవైపు వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా కానీ, మహేష్ బాబు కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. రాజమౌళితో సినిమా కోసం మహేష్ ఏడాది కాలంగా ప్రిపరేషన్ సాగించాడు. మరో ఏడాది పైగానే అతడి డేట్లు లాక్ అయ్యాయి.