బాబోయ్ ఏం ప్లాన్ చేశావ్ జక్కన్న..?
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు వారణాసి టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్ ఈవెంట్ రామోజి ఫిల్మ్ సిటీలో జరిగింది.;
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు వారణాసి టైటిల్ లాక్ చేశారు. ఈ సినిమా గ్లింప్స్ ఈవెంట్ రామోజి ఫిల్మ్ సిటీలో జరిగింది. గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ సమక్షంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఈవెంట్ లో రిలీజ్ చేసిన వారణాసి గ్లింప్స్ తో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ లేకుండా విజువల్స్ తోనే పిచ్చెక్కించాడు జక్కన్న.
మహేష్ లుక్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్
ఐతే ముందు వారణాసి 512 CE ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ శంభవి 2027 CE.. అంటార్కిటికా ఆఫ్రికా.. ఉగ్రభట్టి కేవ్.. లంకా నగరం త్రేతాయుగం.. వారణాసి మణికర్ణిక ఘాట్.. ఇలా విజువల్స్ అన్నీ చూపించి ఫైనల్ గా ఆ మహదేవుడు నంది మీద తాండవం ఆడేందుకు వస్తున్నట్టుగా ఎద్దు మీద మహేష్ అలా త్రిశూలం పట్టుకుని వచ్చాడు. మహేష్ లుక్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చాయి. ఇక రాజమౌళి అసలు ఈ సినిమా ఎలాంటి కథతో చేస్తున్నాడన్న డిస్కషన్ మొదలైంది.
విజువల్స్ చూస్తుంటే వారణాసి సినిమాతో రాజమౌళి ఏదో పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. ఐతే కొద్దిరోజుల క్రితం రిలీజైన పృధ్విరాజ్ కుంభ లుక్ చూస్తే అతను వీల్ చైర్ లో కూర్చున్నాడు. ఆ తర్వాత మందాకినిగా ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశారు. గొప్ప బిలీనియర్ అయిన కుంభ తన అవిటితనం తో పాటు మరణం లేని సంజీవణి రుద్రని వాడుకుంటాడా అన్నట్టుగా కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి సినిమా అంటేనే..
ఐతే మనం గెస్ చేసినట్టుగా రాజమౌళి చేస్తాడా.. ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుందిగా.. రాజమౌళి సినిమా అంటేనే ఆయన మార్క్ ఉంటుంది. జస్ట్ వారాణాసి గ్లింప్స్ తోనే ఫ్యాన్స్ కి టికెట్ వర్త్ వైబ్ ఇచ్చాడు. ఇక సినిమా తో తప్పకుండా విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడని అనిపిస్తుంది. ఐతే ఈ సినిమా గ్లోబ్ త్రొట్టర్ కాస్త టైం త్రొట్టర్ అని వేశాడు జక్కన్న. అంటే టైం ట్రావెల్ తో లింక్ చేస్తూ వారణాసి, రామాయణ ఘట్టాలను కూడా ఈ సినిమాలో చూపించేలా ఉన్నాడు.
ముఖ్యంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పిన రాజమౌళి. రామాయణంలో ముఖ్య గట్టాన్ని చేస్తానని అనుకోలేదంటూ వారణాసి గురించి మరింత హైప్ ఎక్కించాడు. రామయణంలో ముఖ్య ఘట్టం అంటే రావణ సంహారం.. అదేనా మరేదైనా రాజమౌళి క్రియేషన్ తో మరింత భారీగా ప్లాన్ చేశారా అన్నది చూడాలి. ఏది ఏమైనా గత 3 రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న గ్లోబ్ త్రొట్టర్ వైబ్ ప్రస్తుతం టైటిల్ వారణాసిగా ప్రమోట్ అయ్యింది. రాబోతున్న రోజుల్లో సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ కి మరింత ఫీస్ట్ అందిస్తాయని చెప్పొచ్చు.